రెండు రోజుల నుంచి , గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, జనసేన పార్టీ మధ్య నడుస్తున్న ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది... నిన్న గల్లా రిప్లై కి, ఈ రోజు జనసేన మరో ట్వీట్ చేసింది... మీకోసం గుంటూరు ప్రజలు వెతుకుతున్నారు, మీ బాటరీ చార్జ్ చేసుకోండి అంటూ వెకిలిగా ఒక పార్టీ ఆఫిషయల్ ఎకౌంటు నుంచి ఖండన వచ్చింది... దీనికి గల్లా ధీటైన జవాబు ఇచ్చారు.. నేను గుంటూరులోనే ఉంటున్నా, మీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సార్లు కంటే, నేను గుంటూరుకు ఎక్కువ సార్లే వచ్చాను అంటూ ట్వీట్ చేసారు గల్లా.. నిజానికి, గల్లా, పార్లమెంట్ సమావేశాలు అయ్యిన దగ్గర నుంచి గుంటూరులో జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గున్తున్నారు.. మరి, జనసేనకు ఎక్కడ నొప్పి వచ్చిందో కాని, లేపి మరీ, నీ పవన్ ఎన్ని సార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు అనే ప్రశ్న వేయించుకుని, హైదరాబాద్ లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు..

రెండు రోజుల క్రితం, గల్లా జయదేవ్ తన ట్విట్టర్ లో, జగన్ - పవన్ కలిసిపోతున్నారు అని, త్వరలోనే ప్రజల ముందుకు కలిసి వస్తున్నారు అంటూ, ఒక ట్వీట్ చేసారు.. దానికి, తాపీగా రెండు రోజుల తరువాత, జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది... చౌకబారు భాషలో ఒక ట్వీట్ వేసింది... ‘‘వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..’’ అంటూ జనసేన ఆఫిషయల్ హేండిల్ నుంచి ట్వీట్ వచ్చింది..

దీనికి వెంటనే జయదేవ్ రియాక్ట్ అయ్యారు. ‘‘4 సంవత్సరాల నుంచి సుమారు 100 సార్లు స్పీచ్ ఇచ్చాను. అంటే సెంచరీ కొట్టాను. ప్రత్యేక హోదా కోసం మేము కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రిపై యుద్ధం చేస్తూనే ఉన్నాం. మరి పవన్ కల్యాణ్ గారు ప్రధానమంత్రిపై ఎందుకు ఆధారపడుతున్నారో? అసలు ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? ఇక మా బ్యాటరీస్ గురించి చెప్పాలంటే.. అవి ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌తోనే ఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నిజంగా అలాగే ఉంటాయి’’ అంటూ గల్లా దానిని రిప్లై ఇచ్చారు...

Advertisements