కేంద్ర ప్రభుత్వంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు సంబంధించిన పది మందితో కూడిన అత్యున్నత అధికార బృందం, నిన్న రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఈ ప్రతినిధుల బృందం, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందంతో, అదే విధంగా జగన్ మోహన్ రెడ్డితో కూడా కలిసే అవకాసం ఉందని చెప్తున్నారు. ఈ రెండు కార్పొరేషన్ల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాదాపుగా రూ.35 వేల కోట్ల రూపాయలు వరకు కూడా రుణం సేకరించింది. అయితే పవర్ ఫైనాన్సు కార్పోరేషన్ కు సంబంధించి, దాదాపుగా రూ.2 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండటం, అది గత మూడు నెలల నుంచి బకాయి పడటంతో, ఎన్ని సార్లు అడిగినా రాష్ట్రం వైపు నుంచి అసలు స్పందన లేకపోవటంతో, పవర్ ఫైనాన్సు కార్పొరేషన్, ఈ నెల 3 వ తారీఖు లోపు రూ.2 వేల కోట్ల చెల్లించక పోతే, రాష్ట్ర ప్రభుత్వాన్ని డీఫాల్టర్ గా ప్రకటిస్తామని లేఖ రాసింది. అయితే వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాచారం లేదని తెలుస్తుంది. దీంతో ఇక చేసేది ఏమి లేక, అప్పులు వసూలు చేసుకోవటానికి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు చెందిన అధికారుల బృందం విజయవాడకు చేరుకుంది. వీళ్ళు ఈ రోజు చీఫ్ సెక్రటరీ సహా, ముఖ్యమంత్రి కార్యాలయంతో కూడా చర్చించనున్నారు.
తమకు ఇవ్వాల్సిన బకయాల పై ఏదో ఒకటి తేల్చాలని వాళ్ళు అడగనున్నారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేకపోతే మాత్రం, ఈ నేలాఖరుకు, రాష్ట్రాన్ని డీఫాల్టర్ గా ప్రకటించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే, ఈ విషయం ఏపి అధికారులకు చెప్పి, లాస్ట్ వార్నింగ్ గా ఇది చెప్పి వెళ్లేందుకే, ఈ బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఇదే కనుక జరిగితే, రాష్ట్రానికి గడ్డు పరిస్థితి తప్పదు. ఇక అప్పులు ఇవ్వటానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. మరి ప్రభుత్వం ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటుందా, లేదా ఇప్పుడు కూడా వారికి స్పందించకుండా తప్పించుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. ఇక పొతే నిన్న ఎయిర్ పోర్ట్ లో దిగిన అధికారులకు సరైన ప్రోటోకాల్ కూడా రాష్ట్ర అధికారులు పాటించనట్టు తెలుస్తుంది. ఇంత ఉన్నతస్థాయి బృందం వచ్చినా, కేవలం ఒక ఇంజనీర్ వెళ్లి వారికి స్వాగతం పలకటంతో బృందం సభ్యులు ఆశ్చర్య పోయారు. అలాగే చీఫ్ సెక్రటరీ కూడా, ఎప్పుడో మధ్యాహ్నం వరకు అపాయింట్మెంట్ ఇవ్వక పోవటం పై కూడా బృందం సభ్యులు గుర్రుగా ఉన్నారు. వేల కోట్ల అప్పులు ఇచ్చిన వారి పరిస్థితి ఇది.