ఆయన గతంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. కేంద్ర సర్వీసుల్లో చేసారు. కీలకమైన ఆర్ధిక శాఖలో చేసారు. అది కూడా అలాంటి ఇలాంటి పదవిలో కూడా, ఏకంగా కార్యదర్శి పదవిలో. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా ఆయన పని చేసారు. అంటే కేంద్రం ఆర్ధిక మంత్రి తరువాత, ఆ శాఖలో అంత పవర్ ఉండేది ఆయనకే. ఆయనే సుభాష్‌ చంద్ర గార్గ్‌. అయితే ఆయన ఆకంసికంగా రిటైర్డ్ అయ్యారు. స్వచ్ఛదంగా పదవి నుంచి తప్పుకున్నారు. నిర్మలా సీతారామన్‌ ఆర్ధిక మంత్రిగా ఉండగా, సుభాష్‌ చంద్ర గార్గ్‌ కార్యదర్శిగా ఉండేవారు. అయితే ఆయన్ను ఆర్ధిక శాఖ నుంచి, విద్యుత్‌ శాఖకు బదిలీ చేసారు. ఇది అవమానంగా భావించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ , తన పదవికి స్వచ్ఛదంగా పదవీ విమరణ చేసి, 2019 అక్టోబర్ నెలలో రిలీవ్ అయిపోయారు. అయితే అనూహ్యంగా ఆయన రిటైర్డ్ అవ్వగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనతో సంప్రదించి, ఆయనకు వెంటనే ప్రభుత్వంలో సలహదారు పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక సలహాదారుడుగా నియమితులు అయ్యారు. రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో, ఇలాంటి సలహాదారులు కావాలని అనుకున్నారో ఏమో కానీ, రిటైర్డ్ అయిన వెంటనే ఆయన్ను తీసుకు వచ్చారు. అయితే ఎక్కడో ఉన్న సుభాష్‌ చంద్ర గార్గ్‌ కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు ఎలా లింక కుదిరిందో తెలియదు కానీ, ఆయన్ను సలదారుడుగా పెట్టుకున్నారు.

garg 03112020 2

ఆయన సలహాలు ఏ మేరకు ఉపయోగ పడుతున్నయో కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా దిగజారి పోతుంది. ఏడాదికి పెట్టుకున్న అప్పు అంచనాలు, ఆరు నెలల్లోనే రాష్ట్రం దాటేసింది. ఆదాయం పెరగటం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి. మరి సుభాష్‌ చంద్ర గార్గ్‌ గారి సలహాలు వర్క్ అవ్వటం లేదా, లేక ఆయన ఇచ్చే సలహాలు ఏమిటి అనేవి అర్ధం కావటం లేదు. ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు సుభాష్‌ చంద్ర గార్గ్‌ సడన్ గా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడో అక్టోబర్ లో రిటైర్డ్ అయితే ఇప్పుడు ఆయన విమర్శలు చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ తనను కావాలని టార్గెట్ చేసారని, నన్ను ఫైనాన్సు డిపార్టుమెంటు లో లేకుండా చేసారని, ఆమెతో పని చేయటం చాలా కష్టం అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పై, గతంలో పని చేసిన కార్యదర్శి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటంతో, ఇది నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర సలహాదారుగా ఉన్న గార్గ్, ఇలా కేంద్రాన్ని టార్గెట్ చేయటం వెనుక, రాష్ట్ర ప్రభుత్వ అజెండా కూడా ఏమైనా ఉందా అనే వార్తలు కూడా వచ్చాయి. నిర్మలా సీతారామన్, గతంలో రాష్ట్రానికి ఇచ్చిన ఆర్ధిక స్వేఛ్చ, ఇప్పుడు ఇవ్వటం లేదనే వాదన మధ్య, ఈ కొత్త అంశం చర్చకు దారి తీసింది.

Advertisements