మీడియా గొంతు నొక్కుతూ, నిరాధార కధనాల పేరుతో, కేసులు పెట్టే అవకాసంతో ఇచ్చిన జీవో 2430 పై, నిన్న ప్రభుత్వం హడావిడిగా ప్రకటన విడుదల చేసింది. ఈ జీవో పై గతంలో హైకోర్ట్ లో కొంత మంది కేసు వేసారు, అయితే తదుపరి విచారణలకు సదరు పార్టీ రాకపోవటంతో, హైకోర్ట్ ఈ కేసులో ప్రభుత్వ తరుపు వాదన మాత్రమే పరిగణలోకి తీసుకుని, కొన్ని సలహాలు ఇస్తూ, కేసును డిస్పోజ్ చేసింది. అయితే మూడు నెలల క్రిందట హైకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశాల పై, తమకు అంకులమైనవి తీసుకుంటూ, ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. మూడు నెలల క్రిందట ఆదేశాలు ఇచ్చినా, హైకోర్ట్ ప్రతి నిన్న అందింది అని, అందుకే నిన్న ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుంది. జీవతో 2430ని హైకోర్ట్ పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వం జీవో ద్వారా అసత్యమైన, నిరాధారమైన వార్త కథనాలపై ఆయా ప్రభుత్వ శాఖలకు చట్టప్రకారం రీజాయిండర్లు విడుదల చేసేందుకు, అవసరమైతే కేసులు నమోదు చేయడానికి హైకోర్ట్ అవకాశం కల్పించింది అంటూ ఆ ప్రకటనలో తెలిపారు.

జీవో నెంబరు 2430 ప్రకారం వార్తా కథనాలు, ప్రసారాల పై ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా ఆయా న్యాయస్థానాలు, వాటి పరిధికి లోబడి తగు విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి హైకోర్టు స్వేచ్ఛను కల్పించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ జీవో 2430 కేవలం క్రిమినల్ చర్యలకు ఉద్దేశించింది కాదని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యదర్శి కోర్టుకు తన ప్రమాణపత్రంలో వివరించారు. దీనిద్వారా సమాచార సేకరణకు అనుమతి నిరాకరించడం, పత్రికా ప్రసారం, ప్రచురణ, పంపిణీ స్వేచ్చలకు భంగం కలిగించే ఉద్దేశం లేదని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. నైతిక విలువలతో కూడిన బాధ్యతాయుతమైన వార్తా కథనాల ప్రచురణ కోసమే ఈ జీవో ఉద్దేశించబడిందని కోర్టుకు వివరించారు. ప్రెస్ కౌన్సిల్ నిబంధనల మేరకు వార్తలను ప్రచురించడం సముచితమని హైకోర్ట్ అభిప్రాయ పడింది. అయితే ప్రభుత్వం, తమకు కావలసిందే చెప్పుకుంది అని, కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో చాలా విషయాలు ఉన్నాయని మీడియా వర్గాలు చెప్తున్నాయి.

Advertisements