ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి సారీ చట్ట వ్యతిరేక నిర్ణయాలతో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నా, ఏ మాత్రం సరి చేసుకోకుండా, మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులలో అభాసుపాలు అవుతుంది. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, మళ్ళీ మమ్మల్ని కోర్టులు కావాలని తప్పు బడుతున్నాయి, మేము మంచి పనులు చేస్తుంటే మాకు అడ్డు పడుతున్నారు అంటూ, మీడియా ముందు చెప్పుకోవటం చూసాం. తాజాగా ఒక ప్రాంతంలో ఇస్తున్న ఇళ్ళ స్థలాల విషయంలో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఇళ్ళ స్థాలాలు కాదు, కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అని గమనించాలి. విజయనగరం జిల్లాలో గుంపం అనే గ్రామంలో, దేవాయల భూములు తీసుకుని ఇళ్ళ స్థలాలకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో, ఆ గ్రామస్తులు ఎదురు తిరిగారు. గుడి భూములు తీసుకోవటానికి వీలు లేదని ఎదురు తిరిగారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా, అక్కడ మార్కింగ్ లు అవి చేస్తూ ఉండటంతో, ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హైకోర్టు మెట్లు ఎక్కారు. ప్రభుత్వం, ఆలయాలకు సంబందించిన భూములు తీసుకుని, ఇళ్ళ స్థలాల పేరుతొ పంచి పెడుతుందని, దీని పై తగు ఆదేశాలు ఇవ్వాలి అంటూ వారు కోర్టుకు ఎక్కారు.

lands 04112020 2

దీని పై స్పందించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు ఆలయాల భూములు తీసుకోవాలనే నిబంధన ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించింది. దీని పై తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయం పై తమకు నాలుగు వారలు లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీని పై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేయవద్దు అంటూ, స్టే విధించింది. అయితే ఇప్పటికే ఇలా ఆలయాల భూముల్లో, మైనింగ్ భూముల్లో, ఆవ భూముల్లో, స్మశాన భూముల్లో, చెరువులు, మునక ప్రాంతాలలో, కొండలు, గుట్టల్లో , అటవీ భూముల్లో, మడ, ఆవ భూముల్లో, పశువుల మేత భూముల్లో, పాఠశాలల ఆటస్థలంలో, ఇలా అనేక చోట్ల ఇళ్ళ స్థలాలు అంటూ ప్రభుత్వం, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటంతో, సదరు పార్టీలు కోర్టుకు వెళ్ళటంతో, అక్కడ మాత్రమే కోర్టు తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ స్టే విధించింది. అయితే, ఇవన్నీ కలిపినా 2 వేల ఎకరాలు కూడా ఉండదు, మరి మిగతా 30 - 40 వేల ఎకరాలు ప్రభుత్వం ఎందుకు పంచిపెట్టటంలో అర్ధం కావటం లేదు. పంచి పెట్టకుండా, కోర్టులు ఆపేశాయి అంటూ, ఎదురు దాడి చేసి తప్పించుకుంటున్నారు. మరి మిగతా చోట్ల భూ సమీకరణ జరగలేదో, మరేదైనా కారణమో కానీ, ఇళ్ళ పట్టాల విషయంలో ప్రభుత్వం ఇలా రాజకీయం చేస్తుంది.

Advertisements