ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఇచ్చిన స్వాతంత్ర దినోత్సవ సందేశం, ఆసక్తి రేపుతుంది. డైరెక్ట్ గా ఏ సందర్భం కానీ, లేక ఏ వ్యక్తి పేరు తీసుకోలేదు కానీ, ఆయన చేసిన సందేశం మాత్రం, నేడు ఏపిలో జరుగుతున్న విషయాలకు, అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు చూసిన తరువాత, ఆసక్తిని కలిగిస్తున్నాయి. సీజే మహేశ్వరి ఇచ్చిన సందేసంలో, మన రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థ సమాజం కోసం, న్యాయం కోసమే పని చెయ్యాలని చెప్పారు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడు, గూడు ఎంత ముఖ్యమో, ఆ వ్యక్తికి సరైన న్యాయం కూడా అందినప్పుడే రాజ్యాంగ ఫలాలు ఈ సమాజానికి అందినట్టు అని చెప్పారు. సమాజంలో ఉన్న ప్రజలకు సరైన న్యాయం జరగాలి అంటే, న్యాయ వ్యవస్థ జోక్యం ఉంటుందని అన్నారు. రూల్ అఫ్ లా అనే దానిని అందరూ అమలు చెయ్యాల్సిందే అని, ఇందులో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్ధకు రూల్ అఫ్ లా అమలు చెయ్యాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు.

భవిష్యత్తులో, న్యాయ వ్యవస్థ మరిన్ని సవాళ్ళు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక మన దేశంలో వ్యవస్థల మధ్య సంక్షోభాలకు అవకాసం లేదని, ఎవరైనా దేశం కోసమే పని చేసి, రాజ్యాంగాన్ని కాపాడాలని అన్నారు. రాజ్యాంగా పరిరక్షణ కోసం పని చేస్తే, వ్యవస్థల మధ్య ఎలాంటి సంక్షోభం వచ్చే అవకాశాలు ఉండవని అన్నారు. అలాగే ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘీంచినా, న్యాయ వ్యవస్థ జోక్యం ఉంటుందని అన్నారు. రాజ్యాంగా వ్యవస్థలో ఉన్న వాళ్ళు రూల్ అఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ బెఫోర్ లా, ప్రొటెక్షన్ అఫ్ పర్సనల్ లిబర్టీ అనేవి పాటించాలని అన్నారు. అలాగే పలువురు జాతీయ నాయకులు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఇక ఇటీవల మరణించిన హైకోర్టు రిజిస్టార్ ని స్మరించుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మన స్వాతంత్రం కోసం పోరాడిన వారిని గుర్తు చేసుకున్నారు.

Advertisements