అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న తీరు పై పలువురు అభ్యంతరం చెప్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకునే వీడియోలు, అసెంబ్లీలో వేసుకుని, సంబర పడుతున్న అధికార పక్షం తీరు పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. కోట్లు ఖర్చు చేసి అసెంబ్లీ నడుపుతూ ఉంటారని, అలాంటి చోట ప్రజా సమస్యలు కాకుండా, వ్యక్తిగత అజెండాను అమలు చేయటం పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఈ కోవలోనే గుజరాతీ కంపెనీ అముల్ కు, రాష్ట్రంలో పాల సేకరణ ఇవ్వటం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో, హెరిటేజ్ పై వ్యాఖ్యలు చేసింది అధికార పక్షం. జగన్ మోహన్ రెడ్డి అయితే, ఏకంగా ఓక ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉంటే షేర్ రేటు పెరుగుతుంది అని, లేకపోతే తగ్గిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీలో అంటే చెప్పారని అనుకోవచ్చు. అది తీసుకుని వచ్చి ఏపి సియం సోషల్ మీడియా హ్యాండ్లెస్ లో వేసారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. అసలు హెరిటేజ్ అనే ఒక సంస్థ గురించి చర్చించి, దాని గురించి అసెంబ్లీలో చర్చ చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. హెరిటేజ్ కి 12 రాష్ట్రాల్లో మార్కెట్ ఉంది. 11 రాష్ట్రాల్లో పాల సేకరణ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో సేకరణ మహా అయితే ఒక 10 శాతం ఉంటుంది. అది రేపటి నుంచి ప్రజలు తక్కువ రేటు అని ఇవ్వకపోతే, వేరే రాష్ట్రాల్లో వ్యాపారం పెంచుకుంటారు.

heritage 05122020 2

హెరిటేజ్ కి పోయేది ఏమి ఉండదు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 20కు పైగా సహకార డైరీలు ఉన్నాయి. వాటికి, మాత్రం చాలా నష్టం జారిగే అవకాసం ఉంది. ఇది ఇలా ఉంటే, అసెంబ్లీలో జగన్ చేసిన ఆరోపణల పై హెరిటేజ్ ఘాటుగా స్పందించింది. హెరిటేజ్ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన కంపెనీ అని, గత 25 ఏళ్ళుగా హెరిటేజ్ కంపెనీ అంచెలు అంచెలుగా ఎదుగుతూ వచ్చిందని, స్టాక్ మార్కెట్ లో పెరగటం, తగ్గటం అనేది, కంపెనీ పని తీరుతో పాటుగా, పెట్టుబడిదారుల నమ్మకం పై, మారుతూ ఉంటుందని, దీనికి అధికారంలో ఉండటానికి సంబంధం లేదని తెలుసుకోవాలని తెలిపింది. షేర్ వేల్యూ రిగ్గింగ్ అనేది జరగదని, అది స్టాక్ మార్కెట్ నియంత్రణలో ఉండే అంశం అని, తెలుసుకోవాలని పేర్కొంది. అడ్డగోలుగా తమ షేర్ వేల్యూ పెంచుకోవలానే ఆలోచన తాము ఎప్పుడూ చేయం అని, విలువలతో ఇన్నాళ్ళు మార్కెట్ లో ఉన్నాం అని, మీ రాజకీయాల కోసం తమ పై , ఇలాంటి ఆరోపణలు చేయవద్దు అని కోరింది.

Advertisements