విజయవాడ స్వర్ణా ప్యాలెస్ లో, ఘోరం జరిగి నేటికి వారం రోజులు. అప్పటి నుంచి, ఈ కేసు పై విచారణ జరుగుతుంది. స్వర్ణా ప్యాలెస్, రమేష్ హాస్పిటల్ ని ఇందులో బాధ్యులని చేసి, పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో కచ్చితంగా స్వర్ణా ప్యాలెస్, రమేష్ హాస్పిటల్స్ దే బాధ్యత ఉంటుంది. ఇందులో తప్పు ఏమి లేదు. అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం, దీన్ని కులం వైపుకు తీసుకు వెళ్ళింది. ఇప్పటి దాకా అందరికీ విజయవాడలో డాక్టర్ రమేష్ అనే తెలుసు కానీ, వైసీపీ మాత్రం, రమేష్ చౌదరి అంటూ, లేని తోక తగిలించి, ఒక వికృత రాజకీయ క్రీడకు తెర లేపారు. ఇక మరో పక్క ఈ కులం దాడి పై డాక్టర్ రమేష్ స్పందించారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి చికిత్స చేసాం అని, ఎప్పుడూ ఇలా కులం పెట్టి వేలు చూపించలేదని అన్నారు. ఇక మరో పక్క ఈ మొత్తం ఘటన పై నిన్న హీరో రాం, కొన్ని ట్వీట్లు చేసారు. జగన్ మోహన్ రెడ్డి కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ కుట్ర గురించి ఆయన జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసారు. అలాగే జరిగింది ఫైర్ అయితే, ఫీజ్ మీదకు దృష్టి మళ్ళించి, ఫూల్స్ ని చేస్తున్నారని కొన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేసారు.

స్వర్ణా ప్యాలెస్ లో రూమ్ రెంట్ మొత్తం వారే వసూలు చేసారని, కేవలం ట్రీట్మెంట్ బాధ్యతే రమేష్ హాస్పిటల్స్ ది అని, అయినా ఇంతకు ముందు ఇక్కడ ప్రభుత్వమే కదా క్వారంటైన్ సెంటర్ కు పర్మిషన్ ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇలా కొన్ని ప్రశ్నలు సంధించటంతో, ఈ రోజు విజయవాడ పోలీసులు స్పందించారు. ఏసీపీ మాట్లాడుతూ, హీరో రాం విచారణకు ఆటంకం కలిగిస్తే ఆయన పై కూడా విచారణ చేస్తామని అన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, అంతే కాని విచారణకు ఆటంకం కలిగించవద్దు అని అన్నారు. జరిగిన ప్రమాదం పై సీరియస్ గా విచారణ చేస్తున్నామని, కొంత మంది విచారణకు రావటం లేదని, ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నారని, అది నిజమో కాదో వెరిఫై చేస్తున్నామని అన్నారు. అయితే హీరో రాం లేవనెత్తిన ప్రశ్నలకు, చేసిన వ్యాఖ్యలకు, అవసరం అయితే ఆయనకు నోటీసులు ఇస్తాం అని పోలీసులు చెప్పటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అయితే ఈ విషయం పై ఇదే నా చివరి ట్వీట్ అంటూ రామ్ మరో ట్వీట్ చేసారు. న్యాయం మీద నమ్మకం ఉందని, ఈ విషయంతో సంబంధం ఉన్న వారు, లేని వారు అయినా, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరుతుందని అన్నారు.

Advertisements