ఒక ఒప్పందం రద్దు చేస్తున్నప్పుడు, వారికి కారణాలు చెప్పరా ? పలానా కారణంతో, ఒప్పందం రద్దు చేస్తున్నాం అని చెప్పాలి కదా ? రద్దుకు గల కారణాలు చెప్పకుండా, కాంట్రాక్టు ఎందుకు రద్దు సెహ్సారు ? ఒప్పందం రద్దు చేసే ముందు, కనీసం నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా ? ఇది రాష్ట్ర ప్రభుత్వం పై, హైకోర్ట్ కురిపించిన ప్రశ్నల వర్షం. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి, నవయుగను అర్ధాంతరంగా తప్పించటం పై, నవయుగ హైకోర్ట్ లో వేసిన అప్పీలు పిటీషన్ పై, వాదనలు జరిగిన సమయంలో, హైకోర్ట్, రాష్ట్రానికి సంధించిన ప్రశ్నలు ఇవి. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు జెన్కోకి కూడా, ఈ ప్రశ్నలు సంధించారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ట్ ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి రద్దు చేస్తూ, ఆగష్టు 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వెంటనే, అంటే, ఆగష్టు 22న, నవయుగ హైకోర్ట్ లో పిటీషన్ వేసి, ఈ ఉత్తర్వులు, నిలుపుదల చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు సాధించింది.

court 14112019 2

ఆ ఉత్తర్వుల పై, జెన్కో హైకోర్ట్ లో అప్పీల్ కు వెళ్ళగా, సింగల్ జడ్జి, స్టే ని ఎత్తివేస్తూ, ఆదేశాలు జారీ చేసారు. సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ, నవయుగ హైకోర్ట్ లో మళ్ళీ అప్పీల్ చేసింది. ఈ పిటీషన్ పై హైకోర్ట్ వాదనలు వింటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని పై వాదనలు వినిపించిన నవయుగ తరుపు న్యాయవాది, పి.విల్సన్‌, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఒప్పందాన్ని రద్దు చేసారని అన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం హైడల్ ప్రాజెక్ట్, రెండు వేరు వేరు. అయితే, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు సరిగ్గా చెయ్యలేదు అని, హైడల్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేసారని అన్నారు. ఒప్పందం ప్రకారం 58 నెలలు, అంటే, 2023కి ప్రాజెక్ట్ పూర్తీ చేసి ఇవ్వాల్సి ఉండగా, మాకు మాత్రం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ప్రాజెక్ట్ రద్దు చేసారని అన్నారు.

court 14112019 3

ఒప్పందంలోని ఒక్క అంశం తీసుకుని, నవయుగ సంస్థకు వ్యతిరేకంగా సింగల్ జడ్జి తీర్పు ఇచ్చారని, అందుకే స్టేను యథాతథంగా కొనసాగించండి అంటూ హైకోర్ట్ ని విజ్ఞప్తి చేసారు. మరో పక్క జెన్కో తరుపు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ, నవయుగ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది అని, అందుకే రద్దు చేసామని అన్నారు. నవయుగకు 27 సార్లు నోటీస్ ఇచ్చామని, నవంబర్ నుంచి జూన్ వరకు పనులు కొనసాగాలని, అందుకే స్టే వెకేట్ చేసి, కొత్త కాంట్రాక్టు కు ఇచ్చామని అన్నారు. సింగల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోవద్దు అంటూ హైకోర్ట్ ని కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

Advertisements