రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఒక్క పైసా కూడా పన్ను పెంచని ప్రభుత్వం, ఇప్పుడు పేదలకు ఇంటి పన్ను మినహాయింపు ఇస్తుంది. రాష్ట్రంలో రూ.2లక్షలలోపు విలువ ఉన్న గ్రామీణ ఇళ్లకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 80 లక్షలు ఇళ్లు ఉండగా 44 లక్షల ఇళ్లకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. పూరి గుడిసెలు,మట్టి ఇల్లు,రేకులు,పెంకుటిళ్ళు మొదలైనవన్నీ ఈ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

inti pannu 25042018

గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం కారణంగా 3200 కోట్లు ఉపాధి హామీ పథకం మెటీరియల్ వెనక్కి వెళ్ళిపోయింది కానీ, ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, అధునాతన టెక్నాలజి తో డ్యాష్ బోర్డ్ ఏర్పాటు చేసామని, దీని వలన కార్యక్రమాల అమలులో మనం ఎక్కడ ఉన్నాం, ఇతర జిల్లాల పనితీరు తెలుసుకునే అవకాశం వచ్చిందని లోకేష్ తెలిపారు. టెక్నాలజీ సహాయం తో తాగునీటి సమస్యకు చెక్ పెట్టామని, క్షేత్ర స్థాయిలో మీకు ఉన్న సమస్యలు పై నాకు పూర్తి స్థాయి అవగాహన ఉందని, ఒక్కొక్కటిగా మీ సమస్యలను పరిష్కరిస్తున్నాని లోకేష్ అన్నారు... ఇంకా కొన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాను అని చెప్పారు...

inti pannu 25042018

ఉపాధిహామీ పథకంలో భాగంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగస్తులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయం వలన 481 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కలుగుతుందని, క్షేత్ర సహాయకులు ప్రమాదంలో మరణిస్తే చెల్లించే పరిహారాన్ని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచామని, ప్రమాద సమయంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే చెల్లించే నష్ట పరిహారాన్ని లక్షన్నర నుండి 3 లక్షలకు పెంచామని లోకేష్ చెప్పారు. "అతి చిన్న వయస్సులో గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చింది మీ సహకారం పూర్తి స్థాయి లో ఉండాలి. ఒక యువకుడినైనా నా పై ఎంతో నమ్మకంతో పెద్ద బాధ్యత ఇచ్చారు. మీ సహకారంతో విజయం సాధిస్తే భవిష్యత్తులో మరికొంతమంది యువకులకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుందని" లోకేష్ అన్నారు.

Advertisements