చంద్రబాబు మూడు రోజుల పాటు, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ నేపధ్యంలో, ఆయన ముందుగా దుగ్గిరాలలో ఉన్న చింతమనేని ఇంటికి వెళ్లి, ఆయనను, ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించారు. అయితే చంద్రబాబు పర్యటన పై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఉదయమే, 20 మంది దాకా తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేసారు. అలాగే చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, రోడ్డు మార్గాన దుగ్గిరాల వస్తూ ఉండగా, ఆయనకు కలపర్రు టోల్‌గేట్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి స్వాగతం పలికారు. ఈ సమయంలో, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కారు దిగి వచ్చి, పోలీసుల పై అసహనం వ్యక్తం చేసారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ పోలీసులని ప్రశ్నించారు. అయితే, పోలీసులు వెనక్కు తగ్గటంతో, చంద్రబాబు కార్యకర్తలతో కలిసి, ర్యాలీగా చింతమనేని ఇంటికి వెళ్లారు. తరువాత, అక్కడే మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

chintamaneni 1811200019 2

"పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతమైన జిల్లా. ఎప్పుడూ ఇలాంటి చర్యలు చూడలేదు. చింతమనేని ప్రభాకర్ ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టరు. అతని పై ఒత్తిడి తెచ్చారు. అనేక తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. 66 రోజులు జైల్లో పెట్టారు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సియంగా చేశా, అనేక సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఎన్నో ఆందోళనలు చేసా, కానీ ఎప్పుడు పోలీసులు ఇలా ప్రవర్తించలేదు. నేను వస్తున్నా కూడా, ఆంక్షలు విధించారు. మా పోరాటం, పోలీసులు పైన కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల పైన. అలాంటిది నేను వస్తున్నా అని తెలిసి, వచ్చిన కార్యకర్తలను కూడా అరెస్ట్ లు చేసి, వారిని ఇబ్బంది పెడుతున్నారు. వచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కూడా ఇలాగే చేసారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. నాకు స్వాగతం పలకటానికి వస్తే తప్పా. నేను ఎన్నో సార్లు , ఈ 40 ఏళ్ళలో ఎన్నో పర్యటనలు చేసాను కాని, ఎప్పుడూ ఇలా లేదు. ఈ పోలీసులకు ఏమైందో ఏంటో అర్ధం కావటం లేదు. ఇదేమి పద్దతి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

chintamaneni 1811200019 3

అలాగే చింతమనేనికి, ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. అన్నీ తప్పుడు కేసులు పెట్టారని, అనవసరంగా 13 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, తరువాత ఈ అధికారులే ఇబ్బంది పడతారాని, పోలీసులని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే, ఎక్కడో ఒకచోట అధికారులు దొరికిపోతారని, మీకే తరువాత ఇబ్బందులు అని చంద్రబాబు హెచ్చరించారు. చింతమనేనికి ఇంత ప్రజా బలం ఉంటే, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసారని, ఆయనకు స్వాగతం పలకటానికి వస్తే, అలా కుదరదు ఒక్కరే రావాలి, దొంగ చాటుగా రావాలని, సెక్షన్ 30 పెట్టారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సుదీర్ఘ పోరాటాన్ని చేస్తున్న, చింతమనేని ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఇలాంటి వారితో పోరాడుతున్న చింతమనేని అభినందిస్తున్నానాని చంద్రబాబు అన్నారు.

Advertisements