నిన్న జరగాల్సిన జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ను అనుసరించి జగన్ మోహన్ రెడ్డి, మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలు దేరాల్సి ఉంది. ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ చేరుకుని మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో, సాయం త్రం 4.45 గంటలకు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో, రాత్రి 10గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలకాంశలను ఆయన కేంద్ర మంత్రులతోను, కీలకంగా అమిత్ షాతోను చర్చించాల్సి ఉందని, మీడియాకు చెప్పారు. జలవనరుల వ్యవహరాలతో సహా, శాసనమండలి రద్దు, ఎస్ఈసీ వ్యవహరం, కరోనా కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల గురించి జగన్ అమిత్ షాతో మాట్లాడతారనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకాంశాలు, ప్రత్యేకహోదా తదితరంశాల పై జగన్ ఢిల్లీలో అడుగుతారని లీకులు ఇచ్చారు.

అయితే కొవిడ లాక్ డౌన్ సడలింవుల వరిణామాల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా తీరికలేని పరిస్థితుల్లో ఉండటంతో, ఆయనతో చివరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దు అవ్వటంతో, జగన్ తన ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం. నిసర్గ తుఫాను కారణంగా ఏర్పడనున్న పరిస్థితుల పై కూడా, ఆయా రాష్ట్రా ల ముఖ్యమంత్రులతో అమిత్ షా సమీక్షించే పరిస్థితులు ఏర్పడిన కారణంగా జగన్ తో భేటీని కేంద్ర హోంశాఖ తుఫాను తరువాతకు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా పడటంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక మరో ప్రచారం కూడా ఇందులో ఉంది. రాష్ట్రానికి చెందిన కొంత మంది బీజేపీ నేతలు, ఢిల్లీ పెద్దలకు ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ ఒక లేఖ రూపంలో నివేదించినట్టు సమాచారం.

ఇక్కడ జగన్ చేసే పనుల పై ప్రజల్లో పోరాటం అలాగే, న్యాయ పోరాటం కూడా చేస్తున్నామని, సుప్రీం కోర్ట్ లో, ఈ ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న తరుణంలో, హోం మంత్రి, జగన్ ని కలిస్తే, తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇవన్నీ తేలే దాకా, భేటీ వాయిదా వేసుకోమని రాష్ట్ర బీజేపీ నేతలు, కోరిన తరువాతే, ఈ భేటీ రద్దు అయ్యింది అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గవర్నర్ వెంటనే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపటంతో, ఎలక్షన్ కమీషనర్ వ్యవహారం పై, బీజేపీ పై కూడా విమర్శలు వస్తున్న తరుణంలో, సుప్రీంలో ఈ కేసు చేరిన సమయంలో, కేంద్ర హోం శాఖ మంత్రితో, జగన్ భేటీ అయితే, రాష్ట్రంలో బీజేపీకి నష్టం అని, కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించటంతో, రాష్ట్ర బీజేపీ సఫలం అయ్యిందనే ప్రచారం జరుగుతుంది.

Advertisements