గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది పనిచేసిన సంగతి ఆదరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం ఆయనను బదిలీ చేస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఆయన స్థానంలో, విజయానంద్ ను నియమించింది. అయితే ఆ సమయంలో ద్వివేదికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే ఈ రోజు తాజాగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. గోపాలకృష్ణ ద్వివేదినీ ‘పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి’ మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అంటే చాలా కీలకమైన పదవి అనే చెప్పాలి. ఇంతటి కీలకమైన పదవి ఆయనకు అప్పచేప్పటానికి కారణం మొన్న ఎన్నికలు 'బాగా' జరిపించటమే అయి ఉంటుందని, సెక్రటేరియట్ లో అనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ద్వివేది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు వరకూ కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేశారు. ఏపీ పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల అనంతరం ద్వివేదినీ బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కె. విజయానంద్ ను నియమించింది. అయితే ద్వివేదికీ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరో పక్క ఎన్నికల్లో ద్వివేది తీరు పై తెలుగుదేశం పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సాక్షాత్తు చంద్రబాబు నాయడు, ముఖ్యమంత్రి హోదాలో, ఆయన దగ్గరకు వెళ్లి మరీ నిరసన తెలిపి వచ్చారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటంతో, ద్వివేది సేవలను గుర్తించి కీలక పదవి ఇచ్చారు.

 

Advertisements