ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియంను ప్రతిష్టాత్మికంగా తీసుకుంటే, సొంత పార్టీ ఎంపీల నుంచే ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అన్ని స్కూల్స్ లో, తెలుగు మీడియం తీసివేసి, ఇంగ్లీష్ మీడియం పెట్టటం పై, విమర్శలు ఎదురు అయ్యాయి. అయితే జగన్, వారందరినీ తిప్పి కొట్టారు. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య పై కూడా, అదే రకమైన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు పత్రికల్లో తెలుగు ఆవశ్యకత పై, కధనాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు భాషను చంపవద్దని, ఆప్షనల్ గా తెలుగు మీడియం పెడితే, అటు వైపు ఆసక్తి ఉన్న వారు వెళ్తారని, చెప్తున్నా, ప్రభుత్వం వినటం లేదు. ఈ నేపధ్యంలోనే, సొంత పార్టీ నుంచి జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బంది ఎదురైంది. తెలుగు భాష పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు, పార్లమెంట్ లో, ప్రశ్న అడిగారు. తెలుగు అకాడమీ విభజన ఇంకా జరగలేదని, అది జరపాలని, తెలుగు భాషని కాపడాలని, ఇలా కొంత సేపు మాట్లాడారు.

raghu 20112019 2

అయితే ఇందులో తప్పు ఏమి లేకపోయినా, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న జగన్ కు మాత్రం, కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ప్రతిపక్షాలకు సమాధానం చెప్తున్న సమయంలో, సొంత పార్టీ నేతే తెలుగు ప్రాముఖ్యత అడగటం పై, జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం వచ్చేలా ఎవరు మాట్లాడిన ఉపేక్షించను అని, పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువు మా విధానం అని, దీని పై పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించి, వివరణ కోరాలని జగన్ ఆదేశించారు. అయితే ఈ వార్తలు నిన్న రాత్రి టీవిల్లో రాగానే, రఘురామకృష్ణ రాజు, ఏబీఎన్ ఛానల్ కు అందుబాటులోకి వచ్చి, తాను అసలు ఇంగ్లీష్ మీడియం గురించి ఎక్కడా మాట్లాడలేదని, కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే, నా పై అపోహలు వచ్చాయని అన్నారు.

raghu 20112019 3

తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమి లేదని, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం గురించి మాట్లాడలేదని, కేవలం మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే కోరానని చెప్పారు. నాకు తెలుగు భాష అంటే ఇష్టం కాబట్టి, మాట్లాడానని అన్నారు. 350, 350ఏ అధికరణల్లోని మాతృభాష, బోధన గురించి ఎందుకు మాట్లాడారు అని అడగగా, రాజ్యాంగం ప్రకారం మాట్లాడాలి కాబట్టి మాట్లాడాను, అది మాతృభాష గురించి, అది ఏ భాష అయినా కావచ్చు అంటూ స్పందించారు. తెలుగుని పరిరక్షించుకోవటం అందరి బాధ్యత అని అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ సంజయషీ అడగలేదని, అడిగితె అర్ధం అయ్యేలా చెప్తానని, తెలుగు భాష పరిరక్షణకు నేను మాట్లాడింది తప్పు అయితే, ఏ శిక్షకైనా సిద్ధం అని అన్నారు. అయితే రఘురామ కృష్ణంరాజు పై మొదటి నుంచి జగన్ అసహనంగానే ఉన్నారని తెలుస్తుంది.

Advertisements