‘దావూద్ ఇబ్రహీం ఉగ్రవాదం.. నీరవ్ మోదీ బ్యాంక్ చీటింగ్.. హర్షద్ మెహతాది ఆర్థిక నేరం.. చార్లెస్ శోభరాజ్‌ది హింసావాదం.. ఈ నేరాలన్నీ కలగలసిన కరడుగట్టిన క్రిమినల్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్షన్ మిషన్-2019పై శనివారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ‘జగన్‌ది టిపికల్ విలన్ క్యారెక్టర్ అని.. ఇలాంటి విలనిజాన్ని ఇంతవరకు ఏ తెరపైనా చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)లో తొలిపాఠం ఆయన లాంటివాళ్ల గురించే ఉంటుందని గుర్తుచేశారు. ఎఫ్‌బీఐలో జగన్ తరహా నేరాల నిరోధంపై శిక్షణ ఇస్తారన్నారు.

bjp 25032019

పైకి నవ్వటం.. లోన కుతంత్రాలు.. వేధింపులు.. అనుకున్నది సాధించేందుకు విధ్వంసాలు.. ప్రత్యర్థులకు బెదిరింపులు.. పైకి అద్భుత నటన.. లోన ఆర్థిక ఉగ్రవాదం.. కరడుగట్టిన నేరస్వభావం.. అరుదైన క్రిమినల్ మనస్తత్వం గురించి ఎఫ్‌బీఐలో తొలి పాఠ్యాంశంగా బోధిస్తారని తెలిపారు. కేసుల మాఫీకోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు జగన్ బానిసగా మారారని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కేసీఆర్ చెడగొడుతున్నారని ఆరోపించారు. అక్కడ ఆస్తులున్న వారిపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, చివరకు అధికారులను కూడా బెదిరించే స్థాయికి దిగజారారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

bjp 25032019

ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి గురించి మోదీని ప్రశ్నించే ధైర్యం జగన్‌కు లేదన్నారు. ఆస్తుల విభజనను అడ్డుకునే కేసీఆర్‌తో జతకట్టారని ఆంధ్ర ద్రోహులను ఒక్క మాట కూడా అనలేరని విమర్శించారు. ముస్లింలు, ఎస్సీలపై దాడులు జరుగుతున్నా బీజేపీ, టీఆర్‌ఎస్‌తో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పార్టీ, నాయకుడు ఏపీకి అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ, గుజరాత్‌ల కంటే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందనే అక్కసుతోనే ఏపీని నష్టపరిచేందుకు మోదీ, కేసీఆర్‌లతో జగన్ మిలాఖత్ అయ్యారని మండిపడ్డారు. ముగ్గురూ కక్షకట్టి ఏపీ, టీడీపీపై ముప్పేట దాడి చేస్తున్నారని, ఆ మూడు పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

Advertisements