ప్రతి శుక్రవారం తనకు సిబిఐ కోర్ట్ కు రావటం ఇబ్బందిగా ఉందని, శుక్రవారం శుక్రవారం మినహాయింపు ఇవ్వాలని, జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ కోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై, ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా, సిబిఐ ఫైల్ చేసిన కౌంటర్ పై, జగన్ తరుపు వాదనలు వినిపించారు, లాయర్ నిరంజన్‌రెడ్డి. అయితే ఈయన వాదనలు వినిపించే సమయంలో, జగన్ ని ఇష్టం వచ్చినట్టు సిబిఐ సంబోదిస్తుందని, జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, గౌరవనీయ ముఖ్యమంత్రి అని సిబిఐ, జగన్ ని సంబోధించాలని సూచించారు. అలా కాకుండా, సిబిఐ, జగన్ పై ఘాటైన పదజాలాన్ని ఎలా వాడతారంటూ నిరంజన్ రెడ్డి, సీబీఐ పిటిషన్‌ను తప్పుబట్టారు. అయితే సిబిఐ దీని పై ఎలా స్పందించో చూడాలి. చట్టం ముందు ఎవరైనా సమానమే, అని ఇది వరకే సిబిఐ తన సీబీఐ పిటిషన్‌ లో పేర్కున్న సంగతి తెలిసిందే.

cbi 18102019 2

ఇక మరో పక్క, నిరంజన్ రెడ్డి, జగన్ మొహన్ రెడ్డికి, ఎందుకు మినహాయింపు ఇవ్వాలో కూడా వాదనలు వినిపించారు. ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఆయన ప్రతిసారి విజయవాడ, నుంచి హైదరాబాద్ కు విచారణకు హాజరు కావాలంటే, ప్రతి వారం రెండు రోజులు టైం పోతుందని, ఆయన పనులు అన్నీ ఆగిపోతాయని అన్నారు. అంతే కాక, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం అవుతుందని, జగన్‌ తరపున హైకోర్టు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే జగన్ స్థానంలో, ప్రతి వారం, ఆయన తరపున న్యాయవాది కోర్టుకు హాజరవుతారని తెలిపారు. జగన్ ని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారని కూడా చెప్పారు. ఈ సందర్భంగా హాజరు మినహాయింపు పై సుప్రీంకోర్టు తీర్పులను నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు.

cbi 18102019 3

మరో పక్క, తాను హాజరుకాకపోతే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ తెలపాలని, జగన్ తరుపున ఆయన లాయర్ కోరారు. గత ఆరేళ్లలో ఎప్పుడూ కేసుల వాయిదా కోరలేదని, ఇప్పుడు అవసరం కాబట్టి అడుగుతున్నామని అన్నారు. గతంలో పాదయాత్ర కోసం మినహాయింపు కోరితే, రాజకీయ అవసరాల కోసం ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని, కాని ఇప్పుడు సీఎంగా పరిపాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఉందని జగన్ తరుపు లాయర్ కోర్ట్ కు తెలిపారు. సిబిఐ లాయర్ వాదనలు వినిపిస్తూ, గతంలో ఇవన్నీ చర్చకు వచ్చాయని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు, హైకోర్టు జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించాయన్నారు. జగన్ హోదా మారింది ఏమో కాని, కేసులు అలాగే ఉన్నాయని అన్నారు. అంతగా పనులు ఉంటే ఆ రోజు మినహాయింపు కోరోచ్చని అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్ట్, తీర్పును నవంబర్‌ 1కి వాయిదా వేసింది.

Advertisements