జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన పధకం ఈ రోజు విజయనగరంలో ప్రారంభించారు జగన్. ఈ సందర్భంగా, విజయనగరంలోని అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు, పేపర్లు, ఛానళ్ళు ఉన్మాదులు లాగా తన పై పడ్డారని అన్నారు. ప్రజల కోసం, ఎంత మంచి చేస్తున్నా, వీళ్ళు అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ, జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పరిశ్రమలు అన్నీ వెళ్ళిపోతున్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన పత్రికలూ, ఛానెల్స్ లో, డబ్బులు ఇచ్చి వ్యతిరేక కధనాలు రాస్తున్నారు అంటూ, జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, డబ్బులు ఇచ్చి తన పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అని అన్నారు అంటే, అది ఎంత పెద్ద ఆరోపణ అనేది అర్ధం చేసుకోవచ్చు. జగన్ ఇంతటితో ఆపలేదు.

jagan 24022020 2

తాను మూడు ప్రాంతాలకు న్యాయం చెయ్యాలని, మూడు రాజధానులు తీసుకు వస్తే, మూడు ప్రాంతాలకు సమాన న్యాయం చెయ్యాలని తాను చూస్తుంటే, తమ పై, ఉన్మాదులు లాగా దాడి చేస్తున్న వీళ్ళను ఏమనాలి అంటూ, జగన్ ప్రశ్నించారు. ప్రతి పేద వాడికి ఇళ్ళు ఉండాలని, అందుకే వారికి 25 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అయితే దీని పై కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు అంటూ, జగన్ మండి పడ్డారు. దళితుల భూములు లాక్కుని, అసైన్ భూములు లాక్కుని, ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు అంటూ, చాలా మంది, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఆ విషయాన్ని చూపించిన మీడియాను, జగన్ ఉన్మాదులు అంటూ వాపోయారు.

jagan 24022020 3

నిజంగా సమస్య ఉంటే, దాని పై ఫోకస్ చెయ్యాలి కాని, తన పై వ్యతిరేక వార్తలు రాస్తే, ఉన్మాదులు అనటం ఏమిటి అంటూ, ప్రతిపక్షాలు ప్రస్నిస్తున్నాయి. ఇక మరో పక్క, స్థానిక సంస్థల్లో బీసీలకు సీట్లు పెంచుతూ మేము నిర్ణయం తీసుకుంటే, ప్రతిపక్షాలు కోర్ట్ కు వెళ్లి, ఏదో జరిగిపోయినట్టు, విపరీత వార్తలు రాసారని, జగన్ వాపోయారు. అయితే, జగన్ వ్యాఖ్యల పై టిడిపి మండి పడింది. ఒక వేళ, వార్తల్లో రాసింది, ఛానెల్స్ లో చుపించింది తప్పు అయితే, జగన్ తెచ్చిన జీవో 2430 పై చర్యలు తీసుకోవచ్చు కదా అని వాపోయాయి. ఆ వార్తలో నిజం ఉండబట్టే, ప్రభుత్వంలో ఉండి కూడా, ఇంకా ఎదురు మీడియా పై, తన అక్కసు చూపిస్తున్నారని, జగన్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని, ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆరోపణలు చేసి తప్పించుకోలేరని, అన్నిటికీ సమాధానం చెప్పాలని వాపోయింది టిడిపి..

Advertisements