ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలవడం చారిత్రక అవసరమంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను జగన్ స్వయంగా తెలుసుకున్నారు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం తీసుకొస్తారన్న నమ్మకం ఉందన్నారు. జగన్‌కు ఒక విజన్‌ ఉందని.. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఏపీలో జగన్ హవా నడుస్తోందని.. ఎక్కడ చూసినా రావాలి జగన్-కావాలి జగన్‌ నినాదం వినిపిస్తోందన్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి 20కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటారని ఓవైసీ జోస్యం చెప్పారు.

supreme 07042019

జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక లెజెండ్‌.. ఏపీలో ముస్లింలందరూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉన్నారన్నారు. ముస్లింలు మాత్రమే కాదు.. అన్నివర్గాల ప్రజలు జగన్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలన, చంద్రబాబుపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు అసదుద్దీన్. బాబు ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని.. ముస్లింలకు ఆయన చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదని ధ్వజమెత్తారు. బాబును ముస్లింలు ఎప్పటికీ నమ్మరు..బాబుకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అన్నారు.. అయితే బీజేపీతో అంటకాగుతున్న జగన్ పై, ఒక్క మాట కూడా అనకపోవటం విశేషం. ఏదేమైనా ఏపి పై దాడి చెయ్యటానికి, హైదరాబాద్ నుంచి అందరినీ వాడుతున్నాడు జగన్.

Advertisements