‘‘కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై వైసీపీ అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరంగా ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకోకపోతే కాపుల ఆగ్రహానికి గురవ్వక తప్ప దు’’ అని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్‌ అన్నారు. వీజేఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని చెప్పడం రాజకీయ తప్పిదమవుతుందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కమిటీ వేయడం, కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని శాసనసభ ఆమోదించి, కేంద్రానికి పంపిన విషయం తెలిసిందేనన్నారు. కాపులకు రిజర్వేషన్‌పై జగన్‌ ఇలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిచిందన్నారు.

jagan 30072018 4

వైసిపీ పార్టీలోని కొంత మంది కాపు నేతలు సమావేశం అయ్యారు. కేవలం కావాలనే రిజర్వేషన్లు మీకు అందవంటూ చాలా తేలిగ్గా జగన్‌ ప్రకటన చేశారని, అంతేతప్ప పోరాటం చేసైనా సాధించుకుంటామని ఒక్క ముక్క కూడా చెప్పకుండా, అసలు సిసలైన మనసులో మాటను ఇప్పటికైనా బయట పెట్టారంటూ దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ చేసిన కీలక ప్రకటన దృష్ట్యా ఆదివారం నాడంతా కాపు నేతలంతా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. ఎవరు నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చ. వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపాటు. ఇదే తరుణంలో స్వపక్షంలోనూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సామాజికపరంగా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి అలవికాకుండా పోయింది. కీలక సమయంలో జగన్‌ ఇలా ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందోనని వైసీపీ నేతలు పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

jagan 30072018 3

విధాన నిర్ణయాల్లో చర్చించకుండానే, బహిరంగ ప్రకటన చేస్తున్నారని, దీని ప్రభావం నేరుగా పార్టీపై పడుతుందని, అందునా కాపులకు కంచుకోట అయిన తూర్పు గోదావరిని ఈ ప్రకటన చేసేందుకు వేదికగా వాడుకోవడం మరింత చేటైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అంతో ఇంతో బలపడుతున్నామని భావిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీకి తాజా ప్రకటన నష్టదాయకమేనని తేల్చిచెబుతున్నారు. కాపు సామాజిక వర్గంలోని నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదో చేస్తారనుకుంటే అది మా వల్లకాదంటూ ముందుగానే పారిపోయారంటూ మిగతా పార్టీల్లోని కాపు నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. రుణమాఫీ పథకాన్ని తెలుగుదేశం తెరముందుకు తెచ్చిన తరువాత రైతుల్లో కొంత ఆత్మసంతృప్తి కనిపించిందని, సరిగ్గా అదే సమయంలో రుణమాఫీ మేం చేయలేమని జగన్‌ తెగేసి చెప్పి చేతులు కాల్చుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

Advertisements