కొద్ది సేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. తిరుపతి పార్లమెంట్ ఓటర్లకు, మీ జగనన్న రాస్తున్న లేఖ అంటూ కూడా ఆ లేఖను విడుదల చేసారు. పార్టీ లెటర్ హెడ్ పై రాసిన ఈ లేఖలో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారానికి తాను రావాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, క-రో-నా కారణంగా తాను రాలేక పోతున్నా అని, తన పర్యటన రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. నిన్న హెల్త్ బులిటెన్ చూస్తే, ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పోజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటం, పైగా మరణించిన వారిలో కూడా, ఎక్కువగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వారు ఉన్నారని, అందు వల్ల తాను, బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ, వేలాది మంది ప్రజానీకం వచ్చి, మరింతగా క-రో-నా విస్తృతంగా వ్యాప్తించే అవకాసం ఉందని, అందుకే తాను రాకుండా, ఈ లేఖ రాస్తున్నా అని, బాధ్యతగల ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా తన పర్యటనను రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ లేఖలో మాత్రం, చివరి రెండు పేరాల్లో, ఎందుకు ఓటు వేయాలో రాసారు. తాను ప్రత్యేకంగా ఒక లేఖ రాసాను అని, ఆ లేఖలో తాను ఏమి రాసానో అందరూ చదవాలని, తరువాత తన సోదరుడు అయిన గురుమూర్తిని, ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని జగన్ చెప్పారు.

tirupati 10042021 2

అయితే జగన్ నిర్ణయం పై మాత్రం, ఇంకా ఏదో జరిగి ఉంటుందనే ఆలోచన వస్తుంది. జగన్ కు క-రో-నా పట్ల అంత బాధ్యత ఉంటే, మొత్తం వైసీపీ ప్రచారాన్నే రద్దు చేయాలని, లేదా లిమిటెడ్ గా వెళ్ళాలని పార్టీ శ్రేణులకు చెప్పాలని, అక్కడ మాత్రం వైసీపీ నేతలు, ప్రజలను పోగేసి, భారీగా రోడ్ షోలు చేస్తుంటే, జగన్ మాత్రం తాను ఒక్కడినే రాను అని, తనకే బాధ్యత ఉందని చెప్పటం ఎవరికీ అర్ధం కావటం లేదు. జగన్ కు నిజంగా బధ్యత ఉంటే, మిగతా వైసీపీ నేతలకు కూడా అదే చెప్పొచ్చు కదా ? క-రో-నా అనేది ఎవరు మీటింగ్ పీట్టినా వస్తుంది కదా. అయితే దీని వెనుక రాజకీయ కారణం కూడా లేకపోలేదు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరులో ఎండలు ఎక్కువగా ఉండటం, పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతున్నప్పటికీ, ప్రజల్లో ఆసక్తి లేకపోవటం కూడా భావిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మికంగా తీసుకోవటంతో, వైసీపీ ఓడిపోకపోయినా, గతంలో వచ్చిన మెజారిటీ కంటే భారిగా తగ్గే అవకాశాలు ఉన్నాయని, రోజులు గడిచేకొద్దీ సమీకరణాలు మారిపోతూ ఉండటంతో, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో, జగన్ రాకపోవటమే మంచిదని, వైసీపీ పెద్దలు భావించి ఉండవచ్చని అంటున్నారు.

Advertisements