జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే గత పది రోజుల్లో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. మొదటి సారి ఢిల్లీ పర్యటనలో కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ని కలిసారు. అయితే సాయంత్రం భేటీ అయిన తరువాత, అమిత్ షా ఆదేశాల ప్రకారం, మరుసటి రోజు కూడా జగన్ , అమిత్ షా ని కలిసారు. ఈ సమావేశంలోనే ప్రధాని కార్యాలయం ప్రధాన కార్యదర్శి కూడా పాల్గున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇదే పర్యటనలో జగన్ వెంట, రిటైర్డ్ సుప్రీం కోర్టు జుస్తిస్ జాస్తి చలమేస్వర్ కుమారుడు కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అదే సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రతినిధులను కలవటం, తన పై సిబిఐ కేసుకి ఇదే మూలం అంటూ వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీని కలిసిన తరువాత, ఆ భేటీ దేని కోసం జరిగింది అనేది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి ప్రెస్ నోట్ రాలేదు. బయటకు మాత్రం, ప్రత్యెక హోదా, పోలవరం నిధులు, విభజన హామీలు, తదితర అంశాల పై జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని కలిసారని చెప్పారు. అయితే శనివారం ప్రభుత్వం విడుదల చేసిన లేఖలు లాంటివి చూసిన తరువాత, న్యాయస్థానంలో ఉన్న జడ్జిల పై కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళారని, ఇది కూడా ఒక అంశం అని అర్ధం అయింది.

అయితే ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న వేళ, జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తారని వార్తలు వస్తున్నాయి. రేపు కాని, ఎల్లుండి కానీ ఆయన ఢిల్లీ వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో రాష్ట్రపతి కోవిండ్, ప్రధాని మోడీ, అపాయింట్మెంట్ కోరారని, అవి రాగానే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయలు దేరి వెళ్తారని అంటున్నారు. అయితే దీని పై మీడియాకు లీకులే కానీ, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి, కొంత మంది జడ్జిల పై ఫిర్యాదు చేస్తూ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రజాప్రతినిధుల పై ఏడాదిలో కేసులు తెల్చేయలని సుప్రీం కోర్టులో ఒక న్యాయవాది చేసిన తరువాతే, ఇలా చేస్తున్నారని, జాతీయ స్థాయిలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, జడ్జీల పై ఫిర్యాదు చేయటానికి ఆయన రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ కోరారా ? లేకపోతే కేంద్ర పెద్దలు, జరుగుతున్న పరిణామాల పై చర్చించటానికి పిలిస్తే, ఇలా బయటకు లీకులు ఇస్తున్నారా ? లేక నిజంగానే రాష్ట్ర సమస్యల పై చర్చింటానికి వెళ్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisements