రేపు కృష్ణా జిల్లాలోకి దొంగల ముఠా ప్రవేశం... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు... ఇది చూసి పోలీసు వారి హెచ్చరిక అనుకునేరు... కాదండి, మన ప్రతిపక్ష నేత జగన్ ముఠా రేపు కృష్ణా జిల్లాలో అడుగుపెడుతుంది... అందుకే, తెలుగుదేశం పార్టీ ప్రజలను అలెర్ట్ చేస్తుంది.. శనివారం కృష్ణా జిల్లాలోకి దొంగల ముఠా ప్రవేశిస్తోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ మ్మెల్సీ బచ్చుల అర్జునుడు హెచ్చరించారు. పట్టిసీమను వ్యతిరేకించిన ప్రతిపక్ష నేత జగన్ డెల్టా రైతాంగానికి క్షమాపణ చెప్పి జిల్లాలో అడుగుపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు.

krishna 13042018

పదవి కోసమే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. మైలవరం నుంచి దేనినేని ఉమ పారిపోతారని వైసీపీ నేతల అసత్య ప్రచారం చేస్తున్నారని, పెడన నుంచి పారిపోయిన జోగి రమేష్‌... మైలవరం నుంచి కూడా పారిపోక తప్పదని బచ్చుల అర్జునుడు జోస్యం చెప్పారు... మరో పక్క ఈ రోజు, జగన్ పాదయాత్రకు సెలవు.. శుక్రవారం కావటంతో, పాదయాత్రకు సెలవు ఇచ్చి కోర్ట్ కు వెళ్లారు... వాన్‌పిక్‌ కేసులో జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై... సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. జగన్ తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

krishna 13042018

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. పట్టాభిరామయ్య కాలనీ సమీపంలో తాను బస చేసిన ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఆయన.. మహానాడు కరకట్ట మీదుగా సుందరయ్య నగర్‌ ముళ్లపూడి రాంప్‌, మణిపాల్‌ ఆసుపత్రి కూడలి వరకు నడిచారు. దారిపొడవునా వివిధ వర్గాల సమస్యలు వింటూ.. వినతి పత్రాలను తీసుకుంటూ ముందుకు సాగారు. మహానాడులో వైఎస్‌ విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించారు. ఉదయం 11 గంటలకల్లా పాదయాత్ర ముగించారు. అనంతరం హైదరాబాద్‌ బయల్దేరారు. రేపు పాదయాత్ర, కృష్ణా జిల్లాలోకి రానుంది...

Advertisements