హోదాకు కేసీఆర్‌ మద్దతు తీసుకుంటే తప్పేంటి.. అని వైసీపీ అధినేత జగన్‌ అన్న వ్యాఖ్యల దుమారం ఐదురోజులు గడిచినా చల్లారడంలేదు. హోదాపైన, ఆంధ్రుల గురిం చి గతంలో కేసీఆర్‌ అండ్‌ కో చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం జగన్‌ ప్రసంగాన్ని పోల్చి చూపుతూ పలు కథనాలు వెలువడు తున్నాయి. సోషల్‌ మీడియాలో కేసీఆర్‌ అండ్‌ కో వ్యాఖ్యలు విస్తృతంగా విహరిస్తు న్నాయి. దీంతో జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఎన్నికల బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రా ద్వేషులతో జగన్‌ చేతులు కలిపారని ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్‌ బలం చేకూర్చారని వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతుగా నిలుస్తారన్నట్లు జగన్‌ అంటుండగా.. గతంలో కేసీఆర్‌, కేటీ ఆర్‌, హరీష్‌రావు, కవితలు అందుకు విరు ద్ధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో ఏపీలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

game 27032019

కేసీఆర్‌ ఏపీ హోదాకు మద్దతిస్తానన్నారని జగన్‌ చెప్తున్న మాటలు.., హరీష్‌ వ్యాఖ్యలతో అబద్ధమని తేలిపోవడంతో జిల్లాలో వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ప్రాజెక్టు ఆపాలని, అమరావతికి పెట్టుబడులు రాకుండా నిలువరించాలని కేసీఆర్‌ అండ్‌ కో విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌ జనం కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్‌ మద్దతిస్తే తప్పేంటి...? అని జగన్‌ నిర్భయంగా చేసిన వ్యాఖ్యలు వైసీపీకి తీవ్ర నష్టాన్ని తెస్తాయని ఆ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

game 27032019

ఇది చాలదన్నట్లు కేటీఆర్‌... జగన్‌ మద్దతు తమకేనని, ఆయన మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పుతామని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వీటికి తోడు కేసీఆర్‌తో గొడవపడి తే ఒక చుక్కనీరు రాదు అని జగన్‌ అన్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పు మన్నా యి. ఈ విషయాలన్నీ వైసీపీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైసీపీకి ఓటేస్తే పెత్తనమంతా కేసీఆర్‌ చేతికి వెళుతుందని సీఎం చంద్రబాబు చేస్తున్న విమ ర్శలకు జగన్‌, కేటీఆర్‌ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఏపీ హోదాకు కేసీఆర్‌ ఎప్పుడు మద్దతు ఇవ్వలేదని, పైగా మద్దతు ఇస్తానన్న వారిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్‌ వ్యాఖ్యలు సెల్ఫ్‌గోల్‌లా మారాయిని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

 

Advertisements