జగన్ మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ లు వస్తున్నాయి... కాని, ఆయనే స్పందించటం లేదు... ఎందుకో తెలియదు కాని, ఈ విషయాల పై మాత్రం, ఎంత ఒత్తిడి ఉన్నా, ఒక్కరు కూడా నోరు విప్పటం లేదు... జవాబివ్వలేక వైకాపా నేతలు సతమతమవుతున్నారు.... ఒక్క వీడియో క్లిప్పింగ్ అయినా చూపించమని ఆయన... కాళ్ళు పట్టుకుంటా అని ఈయన... కాని పాపం, వారి మీద కనికరం చూపించటం లేదు జగన్... ఇంతకీ విషయం ఏంటి అంటే, కర్నూలు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి చేసిన సవాల్‌ మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో బాణంలా దూసుకెళ్లింది...

jagan 14042018 1

జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీని ఒక్కసారైనా విమర్శించినట్లు ఒక్క వీడియో క్లిప్పింగ్‌ చూపించినా చాలు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తమ అధినేతకే మోహన్‌రెడ్డి సవాల్‌ విసరడంపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌గా తీసుకుని తీవ్రంగా చర్చించారట! మోహన్‌రెడ్డి సవాల్‌కు వైకాపా నేతలు సమాధానం వెతికేందుకు కృషి చేస్తున్న క్రమంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా జగన్‌కు చేసిన సవాల్‌ను మరోసారి రిపీట్‌ చేశారు. తాను చేసిన సవాల్‌కు రోజులు గడుస్తున్నా వైకాపా నుంచి సమాధానం రావడం లేదంటే ప్రధాని మోదీని జగన్‌ పల్లెత్తుమాటైనా అనలేదని అర్థమవుతోందని మోహన్‌రెడ్డి అన్నారు.

jagan 14042018 1

ఇది ఇలా ఉండగానే, బీకాం ఫిజిక్స్ అంటూ ఎగతాళి చేసిన ఎమ్మల్యే జలీల్ ఖాన్ కూడా స్పందించారు... ప్రధానమంత్రి నరేంద్రమోడీని జగన్ విమర్శించగలిగితే నేను జగన్ కాళ్ళు పట్టుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... పాదయాత్రలో జగన్ నోటి వెంట మోదీ దొంగ, బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే నా పదవికి రాజీనామా చేస్తానని జలీల్‌ఖాన్ అన్నారు... అయితే అటు మోహన్ రెడ్డి సవాల్ కు కాని, ఇటు జలీల్ ఖాన్ సవాల్ కు కాని, ఎవరూ సమాధానం చెప్పటం లేదు.. మోడీ అంటే భయపడి పోతున్నారు... బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతల లోపాయికారి ఒప్పందం ఏమిటన్నది ఈ సంఘటన రుజువు చేస్తున్నదని టీడీపీ నాయకులు అంటున్నారు.. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisements