ఒక పక్క, పవన్ కళ్యాణ్, గవర్నర్ నరసింహన్ పై గత నెల రోజులుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో, నిన్న జరిగిన మొరో సంఘటన, వీరిద్దరి రేలషన్ ఎలాంటిదో తెలియచెప్పింది... గత నెలలో కాంగ్రెస్ పార్టీ నుంచి, జనసేనలోకి చేరిన ఒక సీనియర్ నేత, నిన్న సాయంత్రం 4 గంటల పాటు గవర్నర్ తో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి... ఈ సీనియర్ నేత గతంలో, కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలు ఎమ్మెల్సీగా పనిచేశారు.. గత నెలలో జనసేన ఆవిర్భావ సభ జరిగే ముందు వచ్చి పార్టీలో చేరారు... అప్పటి నుంచి, ఆయన పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు... అయితే, నిన్న మీడియా కంట పడకుండా, దాదాపు నాలుగు గంటల పాటు, గవర్నర్ తో భేటీ అయ్యారు ఈ నేత..

pk 11042018 2

పవన్, జగన్ లను గవర్నర్ ద్వారా కేంద్రం సమన్వయం చేసుకుంటోందన్న వార్తల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఆకస్మిక సమావేశం... ఇప్పటికే గవర్నర్ పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి... రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నాయనీ, పవన్‌ కల్యాణ్‌ ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారనీ కూడా గవర్నర్‌ కేంద్రానికి నివేదిక ఇచ్చిన నేపధ్యంలో , ! కేంద్ర పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో వేలుపెట్టడం మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌ను పిలిపించుకుని మాట్లాడారని, ఆ ప్లాన్ లో భాగమే, ఆవిర్భావ దినోత్సవంలో, పవన్ అడ్డం తిరగటానికి కారణమని అంటున్నాయి టిడిపి వర్గాలు...

pk 11042018 3

అప్పటి నుంచి పవన్, కేంద్రం చెప్పినట్టే ఆడుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి.. నిజానికి పవన్ కదలికలు వాటికి బలం చేకురుస్తున్నాయి... చంద్రబాబు కేంద్రం పై యుద్ధం ప్రకటించిన మొదట్లో, నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు పై ఫోకస్ పెట్టింది... ఇలాంటి టైంలో, ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాకు ఎక్కటం, మోడీని ఒక్క మాట కూడా అనకుండా, చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేసింది అని గాలిలో ఆరోపణలు చేసి, జాతీయ స్థాయిలో చంద్రబాబుని బలహీన పరిచే కార్యక్రమం చేసారు.. అంతే కాదు, నేషనల్ మీడియాలో, నాకు హోదా అవసరం లేదు, నిధులు ఇస్తే చాలు, ఏ పేరు అయితే ఏంటి అని చెప్పటం, ఒక పక్క రాష్ట్రం అంతా మోడీ పై యుద్ధం ప్రకటిస్తే, నేను మోడీని ఆరాధిస్తాను అని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే, పవన్ ని కేంద్రం ఎలా ఆడిస్తుందో అర్ధమవుతుంది... నిన్న, జనసేన కీలక నేత గవర్నర్ తో రహస్య భేటీ కావటం, చూస్తుంటే, కేంద్రం నుంచి ఎదో డైరక్షన్ వచ్చింది అని, అది చెప్పటానికే గవర్నర్ పిలిపించారని, టిడిపి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి....

Advertisements