ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడు మాట్లాడుతూ, పోలవరంలో చంద్రబాబు అవినీతి చేసారు అంటూ, మాట్లాడారు. చంద్రబాబు దిగిపోయి 18 నెలలు అయినా, కేంద్రం పోలవరంలో అవినీతి జరగలేదని చెప్పినా, ఇప్పటి కొత్త ప్రభుత్వం పోలవరం పనులు నత్త నడకన చేస్తున్నా, వారిని కాకుండా తెలుగుదేశం పార్టీని నిందించటం చూసి,అందరూ ఆశ్చర్య పోయారు. అయితే ఈ అబద్ధాలను తెలుగుదేశం పార్టీ ఖండించింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జవహర్, ఘాటుగా స్పందించారు. ఆయన మాటల్లోనే "ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, చంద్రబాబు గారు అవినీతి అంటూ మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే, ఏమి తెలియని వ్యక్తికి పదవి ఇస్తే అదో రకం, అదే విధంగా అన్నీ తెలిసిన వ్యక్తికి పదవి ఇస్తే అదో రకం, అలా కాకుండా తెలిసీ తెలియని వాళ్లకు ఇస్తే, సోము వీర్రాజు రకంగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా జలవనరులు శాఖ, పోలవరం మీద ఎలాంటి అవినీతి జరగలేదని, పార్లమెంట్ సాక్షిగా చెప్పిన పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో ఉంటే, అదే ప్రభుత్వ పార్టీకి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారు, చంద్రబాబు అవినీతి చేసాడు అంటున్నారు. ఏదైతే పోలవరంలో అవినీతి జరిగింది, చంద్రబాబు సమయంలో, ఆ అవినీతి పై మీరు ఎందుకు మాట్లాడటం లేదని, సోము వీర్రాజు గారు, జగన్ గారిని ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సోము వీర్రాజు గారు మేము ఒకటే చెప్తూ ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పడినప్పుడు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఫాల్ డౌన్ అయ్యే పరిస్థితి కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో ఎక్కడ తిరస్కారానికి గురి అవుతుందో అనే పరిస్థితి వచ్చినప్పుడు, భయంతో, సోము వీర్రాజు లాంటి వాళ్ళు, అప్పుడప్పుడు నిద్ర లెగిసి వచ్చి స్టేట్మెంట్ లు ఇస్తూ ఉంటారు."

somu 05112020 2

"సోము వీర్రాజు గారు మీకు, ఏదైతే కేంద్ర జల శక్తి మంత్రి గారి ఫోన్ నెంబర్ లేకపోతే నేను పంపుతాను. మీరు ఆయన్ను కనుక్కోండి అవినీతి జరిగిందో లేదో. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ ని అరికట్టటంలో రాష్ట్రం ఫెయిల్ అయితే, ఎన్నికలు జరపటం కుదరదు అనే వ్యక్తులు, స్కూల్స్ తెరిచి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంటే, దాని పై మీరు స్పందించండి. అదే విధంగా టిడ్కోకి సంబంధించి, మాట్లాడతా ఉన్నారు. ఈ రోజు ఆవ భూముల్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడండి. అవినీతి పరులు మీ పక్కనే ఉన్నారు, వారిని నిలదీయండి. ఈ రోజు సోము వీర్రాజు గారికి ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. నా ఇల్లు , నా సొంతం అని మేము కార్యక్రమం చేస్తున్నాం. దానికి మీరు మద్దతు తెలియ చేయండి. ప్రభుత్వ అవినీతిని, అలక్ష్యతను ప్రశ్నించండి. అప్పుడు మిమ్మల్ని బీజేపీ నాయకుడిగా మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు కాని, చంద్రబాబు పై ఉన్నవి లేనివి చెప్పి, అవినీతి జరగలేదని మీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, జరిగిందని మీరు చెప్తున్నారు కదా, మీరు కేంద్రంతో విచారణ జరపించుకోండి. చంద్రబాబు హయంలో 72 శాతం చేస్తే, ఇప్పుడు పనులు నత్తనడక కొనసాగుతున్నా, అవి మాట్లాడరు. రివర్స్ టెండరింగ్ లో చేసిన అవినీతి చెప్పారు. అవి చెప్పండి. ప్రజలు హర్షిస్తారు." అని జవహర్ అన్నారు.

Advertisements