ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి, అదిరిపోయే జర్క్ ఇచ్చారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారయణ. మూడు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అన్ని పార్టీల నాయకులకు ఫోన్ చేసి, ఈ నెల 3న జరిగే ఇసుక పై పోరాటానికి, మద్దతు ఇవ్వాలని, తమ పార్టీ చేసే లాంగ్ మార్చ్ కి, అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారయణ కూడా ఫోన్ చేసి, మద్దతు కోరారు. దీని పై స్పందించిన కన్నా, సరే అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం, అసలు పవన్ కళ్యాణ్ దీక్షకు మేము మద్దతు ఇవ్వం అంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ తో కలిసి, ఎలాంటి వేదికలు పంచుకోమని చెప్పారు. అంతే కాదు, ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందని, అసలు ఇలాంటి చోట, బీజేపీ ఉండదు అని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒక్కటే అంటూ, విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

kanna 02112019 2

అయితే విష్ణు వర్ధన్ రెడ్డి వైఖరి పై, అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వైసిపీ ఫ్లో లో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటే అంటూ, విష్ణువర్ధన్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్నారు. ఎవరైనా, ఎదగాలి అంటే అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. కాని, బీజేపీలో ఒక వర్గం మాత్రం, వైసీపీకి మాత్రమే అనుకూలంగా పని చేస్తుంది అనే వాదన వస్తుంది. అయితే, విష్ణువర్ధన్ రెడ్డి మాటలు ఇలా ఉంటే, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం, కుండ బద్దులు కొట్టేసారు. ఇసుక సమస్య పై పోరాడే ఎవరికైనా బీజేపీ సంఘీభావం తెలుపుతుందని చెప్పారు. అయితే విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన మాటలు, విలేఖరులు, కన్నా లక్ష్మీనారాయణకు చెప్పి, దీని పై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు.

kanna 02112019 3

ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగతం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నా మాట ఫైనల్, మేము పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నాం అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే మిగిలిపోయాయి. బీజేపీ పార్టీ మాత్రం, పవన్ కళ్యాణ్ ఇసుక దీక్షకు మద్దతు ప్రకటించింది. అసలకే నిన్న పాత ట్వీట్స్ అన్నీ తీసి, పరువు తీయటంతో, దిగాలుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి, కన్నా లక్ష్మీనారయణ మాటలు, మరింతగా గుచ్చుకునేలా చేసాయి అనటంలో, ఎలాంటి సందేహం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి, వైసీపీకి, జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ముందు నుంచి చెబుతున్నట్టే, ఆయన వైఖరి, ఆయన ప్రకటనలు కూడా ఉన్నాయని, జనసేన వర్గాలు అంటున్నాయి.

Advertisements