మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ వచ్చిన కిరణ్ ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ వచ్చి కిరణ్ ను కలిసాక, ఇక కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ లాంచనమే. అయితే కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ వార్తలు వింటుంటే, జగన్ ఖంగారు పడుతున్నాడు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటివరకు చంద్రబాబుకి ధీటైన ప్రత్యర్ధి లేక, చంద్రబాబుని వ్యతిరేకించే వారు జగన్ వైపు చూస్తున్నారు. పవన్ వచ్చినా, అతని సామర్ధ్యం ఏంటో రోజు రోజుకి ఎక్ష్పొజ్ అయ్యి, సీరియస్ నెస్ లేని రాజకీయ నాయకుడుకిగా మిగిలిపోయాడు. ఇప్పుడు కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఎంతో కొంత ఇమేజ్ ఉంటుంది.

jagankiran 01072018 2

కిరణ్ ఎదో బలమైన నాయకుడు అని కాదు కాని, కిరణ్ కాంగ్రెస్ లోకి వెళ్తే, కాంగ్రెస్ పాత నాయకులు మళ్ళీ ఆక్టివ్ అయ్యే అవకాసం ఉంది. జగన్ వెంట వెళ్ళిన కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాసం లేకపోలేదు. ఎలాగూ జగన్ గెలవడు, ఆ ఉండేది ఎదో కాంగ్రెస్ లో ఉంటే, కొంచెం గౌరవంగా అయినా ఉండచ్చు కదా అనే అభిప్రాయం సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఉంది. మరో పక్క 2014లో కాంగ్రెస్ పార్టీ పై ఉన్న కోపం కంటే, ఇప్పుడు బీజేపీ పై ప్రజల్లో ఉంది. జగన్, బీజేపీతో అంటకాగుతున్నాడు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకంతో, వైరంతో జగన్ తో ఉన్న వారు, ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తారు. ఎన్నికలు అయిన తరువాత, ఏ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చినా, జగన్ కేసులు స్పీడ్ అవుతాయి, అనే అభిప్రాయం కూడా నేతల్లో ఉంది. వీటి అన్నికంటే, జగన్ ను కలవరపెడుతున్న సమస్య మరొకటి ఉంది.

jagankiran 01072018 3

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని భయపడుతున్న జగన్, ఇప్పుడు కిరణ్ ఎంట్రీతో మరింత ఖంగారు పడుతున్నారు. దీనికి కిరణ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పక్షాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ప్రధాన ప్రతిపక్షం వైసీపీని టార్గెట్‌ చేయకపోతే కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఎలా వస్తుందని కిరణ్‌ అన్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్‌ వైసీపీని టార్గెట్‌ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది కిరణ్‌తో మంతనాల ప్రభావమేనని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ జగన్ ను ఎటాక్ చెయ్యటం,దానివల్ల వైసీపీకి కోత పడటం ఖాయం. ఎంత తక్కువ చూసుకున్నా, జగన్ కు పడే, కనీసం 3-4% ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాసం ఉంది. కిరణ్ రాకతో జరిగేది అదే. కిరణ్ గెలవలేడు,కాంగ్రెస్ ని గెలిపించలేడు. కానీ జగన్ పార్టీని ఓడించగలడు. ఇప్పుడు జగన్ ను కలవరపెడుతున్న అంశం ఇదే...

Advertisements