ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ చనిపోయిన విధానం పై, ఆయన పై ప్రభుత్వ వేధింపులే కారణం అని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రూపాయి తీసుకుని వైద్యం చేసిన కోడెల, కేవలం ఫర్నిచర్ విషయంలో ఎదో చేసారు అంటూ, వైసిపీ కావాలని చేసిన విష ప్రచారం వల్ల, ఆయన తీవ్ర అవమానానికి గురై, బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇదే విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు సత్యప్రసాద్‌, మద్దాలి గిరి, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎల్‌.రమ ణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ లో, కేంద్రం హోం సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం నడుస్తుందని ఫిర్యాదు చేసారు.

kishan 18092019 1

జగన్‌ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, కోడెలపై 19 అక్రమ కేసులు పెట్టి ఆయన్ను వేధించిందని, అది తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఈ దుర్మార్గపు ప్రభుత్వం పై, దీనికి కారణం అయిన వారి పై కేసు పెట్టాలని అన్నారు. అయితే ఇవన్నీ వని, కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కేంద్రానికి ఇప్పటికే, కొన్ని ఫిర్యాదులు అందాయని అన్నారు. రాష్ట్ర పోలీసులు, అక్కడ ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చాయని అన్నారు. ఈ విషయం పై కేంద్రంతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.

kishan 18092019 1

కోడెల లాంటి మహా నాయకుడు ఇలా మృతిచెందడం చాలా బాధగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కోడెలతో తనకు వ్యక్తిగత సంబధాలున్నాయని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏ కుటుంబంలో ఇలా జరగొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను గౌరవించాలి కాని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని హిత వుపలికారు. కోడెల విషయం పై, రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలలను కేంద్రం తెప్పించుకుంటుందని అన్నారు. కోడెల మృతి పై రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. కోడెల మృతి విచారణ అంశాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని, కోడెల మృతిపై కేంద్రమే పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా కూడా చూస్తామని వెల్లడించారు కిషన్ రెడ్డి.

Advertisements