మాజీ స్పీకర్, మంత్రి పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న, కోడెల శివప్రసాద్ చనిపోయి రేపటకి ఏడాది అవుతుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆయన గత ఏడాది సెప్టెంబర్ 16న బలవంతంగా చనిపోయిన సంగతి తెలిసిందే. స్పీకర్ గా, మంత్రిగా, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి పై ఫర్నిచర్ దొంగ అనే ఆరోపణలు చెయ్యటం, అలాగే తమ అనుకూల మీడియాలో, విష ప్రచారం చెయ్యటం, చేయని తప్పుకు నిందలు మోపటంతో, ఒకప్పుడు ప్రజల కోసం పల్నాడులు పెత్తందార్లకు తల వంచకుండా బ్రతికిన కోడెల, నేడు కూడా ఎవరికీ తల వంచకుండా బలవంతంగా చనిపోయారు. రేపు కోడెల శివప్రసాద్ ప్రధమ వర్ధంతి కావటంతో, కోడెల అభిమానులు, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసారు. ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పటల్‌ సౌజన్యంతో సత్తెనపల్లితో పాటుగా నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు నేతృత్వంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే మరి కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడతో పాటు కోడెల విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు కోడెల తనయుడు శివరాం తెలిపారు. అయితే ఈ ఏర్పాట్లు తెలుసుకున్న పోలీస్ శాఖ అభ్యంతరం చెప్పింది. కోడెల ప్రధమ వర్ధంటికి అడ్డంకులు సృష్టిస్తూ, కోవిడ్ నిబంధనల పేరుతో రేపు కార్యక్రమం చెయ్యకూడదు అంటూ నోటీసులు ఇచ్చారు. కోడెల శివరాంకు దీనికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా.చదలవాడ అరవింద బాబుకి, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా నోటీసులు ఇస్తూ, రేపు ఎలాంటి కార్యక్రమాలు చెయ్యకూడదని నోటీసులు ఇచ్చారు. దీని పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు లేని ఇబ్బంది, మాకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే రేపు కార్యక్రమాలు జరుగుతాయని, కార్యక్రమాన్ని ఆపేది లేదని, అన్ని కార్యక్రమాలు అనుకున్న ప్రకరామే జరిపి తీరుతాం అని, కోడెల శివరాం తెలిపారు.

Advertisements