రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు నిన్న, కన్నా లక్ష్మీనారాయణకు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే కోవలో, ప్రతి రోజు రంకెలు వేసే సోము వీర్రాజుకి మాత్రం, ముందుగా ఒక లేఖ రాసారు. నా మీద చేస్తిన ఆరోపణలు నిరూపించండి, లేకపోతే మీ మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని వీర్రాజుకు, కుటుంబరావు లేఖ రాశారు. ‘‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించండి. లేని పక్షంలో అసత్య ఆరోపణలు చేసినందుకు సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు సిద్ధంకండి’’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్‌ కుటుంబరావు, బీజేపీ నేతలను హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు ఈ మేరకు ఆయన శుక్రవారం లేఖలు పంపారు.

veerraju 30062018 2

‘‘నేను స్టాక్‌ బ్రోకర్‌గా అనేక మందిని మోసం చేశానని కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మీరు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మీ ఆరోపణలు ప్రసార సాధనాల్లో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. నా గౌరవానికి భంగం కలిగించే అసత్య ఆరోపణలు మీరు చేశారు. మీ ఆరోపణలకు ఆధారాలు చూపండి. నాపై మీకు ఇటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఎవరో తక్షణం వారి వివరాలు నాకు తెలపండి. ఆ వ్యక్తులు ఎవరో మీరు తెలపలేని పక్షంలో నాపై ఆరోపణలు మీరు చేసినట్లుగానే భావించి మీపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు దిగాల్సి ఉంటుంది’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

veerraju 30062018 3

కుటుంబరావు గారు, అనేక సందర్భాల్లో జీవీఎల్ ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టారు. అమరావతి యుసిల దగ్గర నుంచి ఈ రోజు పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు , ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్ష్పొజ్ చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వారు. ఇంకా అంతే, ఒకసారి దొరికేసినాక, ఆ విషయం గురించి మాట్లడే వాడు కాదు ఈ జీవీఎల్. అందుకే, కుటుంబరావు మీద వ్యక్తిగత కచ్చి పెట్టుకుంది బీజేపీ. ఈయన విషయం మొత్తం, ప్రజలకు చెప్తూ ఉండటంతో, వీరి అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మటం లేదని, అందుకే ఆయన వ్యక్తిత్వం పై దెబ్బ కొట్టే ఎత్తుగడ వేసింది. అయితే, ఈయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే, నోటీసు పంపించారు. ఇప్పడు కన్నా , వీర్రాజు ఏమి చేస్తాడో..

Advertisements