నవ్యాంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిన తిరుపతికి భారీ పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ పరిశ్రమలు ఏర్పాటు కాగా మరికొన్ని ఏర్పాటవుతున్నాయి. తాజాగా చైనానుంచి పలు పరిశ్రమలు తిరుపతికి కదలిరానున్నాయి. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి నారా లోకేష్‌తో ఆయా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ టీసీఎల్‌ తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటు కు నాలుగు రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకోగా తాజాగా శనివారం మరో నాలుగు పరిశ్రమలు తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా పలు ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు తిరుపతికి తరలిరానుండటంతో తిరుపతి ఎలకా్ట్రనిక్‌ హబ్‌ నిండుదనం సంతరించుకోనుంది. వేలాది మందికి ఉద్యోగవకాశాలు కలగనున్నాయి.

lokeesh 25092018 2

చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ హబ్‌గా మారుస్తామని, వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు ఐటీ మంత్రి లోకేష్‌ భరోసా ఇచ్చారు. ఆ మేరకు మంత్రి లోకేష్‌ చేస్తున్న కృషిలో భాగంగా టీసీఎల్‌ పరిశ్రమ తిరుపతి దగ్గర ఏర్పాటు చేసేం దుకు ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న లోకేష్‌తో ఆ సంస్థ సీఎఫ్‌వో మైకెల్‌ వాంగ్‌తో గత గురువారం భేటీ అయి టీసీఎల్‌ యూనిట్‌ను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు ఏపీ ఎలక్ట్రానిక్స్‌ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టీసీఎల్‌ తిరుపతిలో ఏర్పాటయితే ఎలక్ట్రానిక్స్‌ రంగానికే మరో కలికితురాయి అవుతుంది.

lokeesh 25092018 3

పరిశ్రమ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యికి పైగా ఉద్యోగాలు లభించే అవకా శాలు ఉన్నట్లు అంచనా వేస్తు న్నారు. టీసీఎల్‌ పరిశ్రమ టీవీలు, వాషింగ్‌ మిషన్లు, స్మార్ట్‌ ఫోన్లు, ఏసీలు, రెప్రిజిరేటర్లు, ఎల్‌సీడీలు తదితర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో పేరెన్నికగన్నది. ప్రపం చంలో 160 ప్రాంతాల్లో చిన్న, పెద్ద కంపెనీలను కలిగి ఉన్న టీసీఎల్‌ భారత్‌లో ముంబైలోని ప్రధాన కార్యాలయం ద్వారా కార్యకలాపాలను సాగిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌ రంగంతో పాటు ఆటోమొబైల్‌ రంగంలో కూడా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటికే హీరోమోటార్స్‌, రాక్‌మెన్‌ ఇండస్ట్రీస్‌, అపోలో టైర్స్‌ పనులు జరుగుతున్నాయి. ఇసుజి మోటార్స్‌ పరిశ్రమ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా అటు ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ రంగాల్లో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది.

 

Advertisements