తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టార్గెట్ గా జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆకస్మికంగా లోకేశ్ భద్రతను కుదించేశారు. ఇప్పటికిప్పుడు వై ప్లస్ భద్రత ని మరింత తగ్గిస్తూ ఎక్స్ క్యాటగిరీకి మార్చారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ, అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా జనంలోకొస్తున్న లోకేశ్ భద్రత తగ్గించడానికి గల కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో పక్క, సెలెక్ట్ కమిటీ సభ్యుడు అయిన లోకేష్, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్తున్న వేళ, ఈ డెసిషన్ షాక్ అనే చెప్పాలి. ఎన్నికలలో ఓటమి తరువాత నారా లోకేశ్ మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన రెండుబిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లడం, మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకునపడేయడంలో నారా లోకేశ్ ముందున్నారు.జగన్ కి 151 మంది ఎమ్మెల్యేలు అండగా ఉన్నా..శాసనమండలిలో తెలుగుదేశందే పైచేయి కావడంతో ఏకంగా మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారు జగన్. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా నారా లోకేశ్ కొంత తగ్గుతారని ఊహించిన జగన్ సర్కారుకు ఝలక్ ఇచ్చారు.

అమరావతి పరిరక్షణకి మద్దతుగా ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు, సామాన్యులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు పార్టీలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారు. అలాగే తప్పుడు కథనాలు రాస్తూన్న సాక్షి పత్రికపై ఇటీవల పరువునష్టం దావా 75 కోట్ల రూపాయలకు వేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భద్రతను ఆకస్మికంగా కుదించారని తెలుస్తోంది. మా-వో-యి-స్టు-ల నుంచి ము-ప్పు పొంచి వుందనే నిఘా సంస్థల నివేదికలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ కి 2014 కు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2+2 భద్రత కల్పించారు.

అనంతరం 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత లోకేశ్ భద్రతని 4+4 కి పెంచారు. అనంతరం మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఇదే భద్రతను ప్రభుత్వం కొనసాగించింది. ఆంద్రా ఒడిశా సరిహద్దులో 2016 సంవత్సరంలో భా-రీ ఎ-న్ కౌం-ట-ర్ జరిగింది. మా-వో-యి-స్టు-లు ఓ లేఖ విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జరిగిన ఎ-న్కౌం-ట-ర్కి బదులు తీర్చుకుంటామని, చంద్రబాబు తనయుడు లోకేశ్ పై దా-డే తమ లక్ష్యమంటూ ప్రకటించారు.ఈ ఘటనతో ఆనాటి ప్రభుత్వం లోకేశ్ కి జె-డ్ క్యాటగిరి భద్రత కల్పించింది. ముందుగా జెడ్ క్యాటగిరి నుండి వై ప్లస్ కి తగ్గించి, ప్రస్తుతం ఎక్స్ కేటగిరీ మార్పు చేస్తూ భద్రతను పూర్తిగా కుదించారు.8 నెలల్లోనే రెండు సార్లు లోకేశ్ భద్రతను కుదించింది వైకాపా ప్రభుత్వం. ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నారా లోకేశ్ ప్రత్యక్షంగా జనంతో కలిసి పోరాడుతున్న ఈ దశలోభద్రత తగ్గించడంపై తెలుగుదేశం పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తనకు కేటాయించిన సెక్యూరిటీ కుదింపు, భద్రతాపరమైన వైఫల్యాలపై మాజీ మంత్రి నారా లోకేశ్ దాదాపు ఎనిమిది సార్లు లేఖలు రాసినా వీటిని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.  

Advertisements