అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డి హాజరుకు సీబీఐ కోర్టు నిన్న మినహాయింపు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున, అదీ కాక నిన్న పోలవరం పర్యటనకు వెళ్ళాల్సి ఉంది కాబట్టి, మినహాయింపు ఇవ్వాలన్న జగన్​ అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. జగన్ తరుపు న్యాయవాది, అశోక్ రెడ్డి, సెక్షన్ 317 కింద, ఈ పిటీషన్ దాఖలు చేసారు. తన క్లైంట్ జగన్, కోర్ట్ కు రాకుండా మినహాయింపు కోరుతూ హైకోర్ట్ కు వెళ్ళారని, ఆ కేసు విచారణ ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది అని, అప్పటి వరకు కోర్ట్ కు వెళ్ళకుండా, మినహయింపు కోరవచ్చు అంటూ హైకోర్ట్ మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని, సిబిఐ కోర్ట్ కు తెలిపారు. పిటీషన్ ఆమోదించిన జడ్జి, విచారణ 6 వ తేదీకి వాయిదా వేసారు. నిన్న ఈ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్​ప్రసాద్​రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. జగన్​ దాఖలు చేసిన డిశ్చార్జ్​ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. ముగ్గురు పారిశ్రామికవేత్తల నుంచి మోసపూరితంగా జగతి పబ్లికేషన్స్​లో పెట్టుబడులు పెట్టించారన్న కేసులో జగన్​కు ఎలాంటి ప్రమేయం లేదని న్యాయవాది అశోక్​రెడ్డి వాదించారు.

lokesh 29022020 2

వాదనల అనంతరం విచారణను సీబీఐ న్యాయస్థానం మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదంతా బాగానే ఉంది కాని, ఈ రోజు తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, మరో కోణం కూడా బయట పడింది అనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన ఈ నెల 27న అంటే గురువారం ఉంటుంది అంటూ, ముందుగా పత్రికలకు చెప్పారు. కొన్ని పత్రికలు ఆ విషయాన్ని ప్రస్తావించాయి కూడా. అయితే తరువాత రోజు, జగన్ పోలవరం పర్యటన గురువారం నుంచి శుక్రవారానికి వాయిదా పడింది. అది ఎందుకు వాయిదా పడిందో తెలియదు కాని, ఈ విషయం పై లోకేష్ స్పందన చూస్తే పాయింట్ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి ఈ విషయం పై, జగన్ కాని, వైసీపీ పార్టీ కాని ఎలా స్పందిస్తుందో చూడాలి

lokesh 29022020 3

లోకేష్ ట్వీట్ చేస్తూ, "శుక్రవారం వస్తే చాలు, స్కూల్ పిల్లలు సాకులు చెప్పి, బడి ఎగ్గొట్టినట్టు ఉంటాయి YS Jagan Mohan Reddy గారి కష్టాలు. ప్రతి రోజు తాడేపల్లి ఇంట్లో పబ్జీ ఆడి కాలక్షేపం చేస్తూ, శుక్రవారం వస్తే తాను సీ.యం అని గుర్తుకు వచ్చి, ఏదో ఒక రివ్యూ పెట్టి, కోర్ట్ కు డుమ్మా కొడతారు. నిన్న జగన్ గారి పోలవరం పర్యటన చూస్తే, ఇదే అనిపిస్తుంది. ముందుగా 27న పోలవరం పర్యటన అన్నారు. కాని అది 28కి ఎందుకు మారిందో, నిన్న సిబిఐ కోర్ట్ లో జగన్ పిటీషన్ చూస్తే అర్ధమవుతుంది." అంటూ ట్వీట్ చేసారు. లోకేష్ ట్వీట్ చేసారు అని కాదు కానీ, ప్రతి శుక్రవారం ఏదో ఒక రివ్యూ పెట్టుకుని, లేకపోతే ఏదో ఒక పర్యటన పెట్టుకుని, ఆ రోజు కోర్ట్ కు వెళ్ళకుండా, విచారణ సాగాదిస్తూ, విచారణ ముందుకు సాగకుండా, ప్రతి వారం జగన్ వాయిదా కోరుతున్నారు అనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇన్ని నెలల పాటు కోర్ట్ కు వెళ్ళకుండా, విచారణకు వెళ్ళకుండా, ప్రతి వారం ఏదోఒకటి చెప్పి, విచారణ తప్పించుకుంటే, ఈ కేసు ఇప్పుడప్పుడే తేలే పని కాదు.

Advertisements