బీజేపీ నేత, సినీ నటి మాధవీ లత, ఈ రోజు పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఆమె పెట్టిన వీడియో మెసేజ్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగానే, రాజకీయ పార్టీ నేతలు కూడా శుభాకాంక్షాలు చెప్తున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యణ్ కూడా ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్లో, యేసు క్రీస్తు జన్మదినం, మొత్తం మానవాళికే పర్వ దినం అంటూ ఉండటం పై, బీజేపీ నేత మాధవీ లత అభ్యంతరం చెప్పారు. మొత్తం మానవాళికే పర్వ దినం అని చెప్పటం పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మొత్తం మానవాళికే దేవుడు కాదని, ఇది తెలుసుకోవాలని అన్నారు. ఇదే భ్రమ అందరికీ ఉందని, ఇది హిందూ సమాజం మొత్తం కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. రెండు రోజుల క్రితం పవన్ విడుదల చేసిన వీడియోలో కానీ, ఈ ట్వీట్లో కానీ, పవన్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇవి మత మార్పిడులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె అభ్యంతరం తెలిపారు. హిందువులు ఎవరూ కూడా క్రిస్మస్ జరుపుకోరని అన్నారు. ఒక హిందువుగా, పవన్ పోస్ట్ పట్ల విచారణ వ్యక్తం చేస్తున్నాం అని అన్నారు. పవన్ ట్విట్టర్ మైంటైన్ చేసే వాళ్ళు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఘాటుగా మాట్లాడారు.

bjp 25122021 2

అయితే ఆమె వ్యాఖ్యల పై జనసేన కార్యకర్తలు మండి పడుతున్నారు. ఇది ఇలా ఉంటే, ఒక పక్క బీజేపీతో పొత్తులో ఉండగానే, జనసేన అధినేత పైనే, ఇలా బహిరంగంగా, హిందూ అజెండా మోసే బీజేపీ నేత, ఇలా చెప్పటం గమనించాల్సిన అంశం. ఒక పక్క మత మార్పిడుల పైన, ఇప్పటికే ఏపిలో పోరాటం చేస్తున్నామని, ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఇలా మానవాళి మొత్తానికి అని వాడటం ఏమిటి అనేది ఆమె ప్రధాన ఆరోపణ. పవన్ లాంటి వ్యక్తులు, ఇలా చేస్తే, ఇది మత మార్పిడులను ప్రోత్సహించటమే అని అంటున్నారు. అయితే, మాధవీ లత అనేక సందర్భాల్లో, తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పే వారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసినా, ఆమె అవి ఖండించి పవన్ కు మద్దతుగా ఉండే వారు. అలాంటి మాధవీ లత, అందరూ పెట్టినట్టే, విషెస్ చెప్తూ పెట్టిన ట్వీట్ పైన కూడా, ఇంతలా రియాక్ట్ అవ్వటానికి కారణం ఏమిటో అర్ధం కావటం లేదు. రాజకీయంగా రెండు పార్టీలు, పొత్తులో ఉండగా ఇలాంటి మాటలు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగుస్తుంది.

Advertisements