నిన్నటి దాక పక్క రాష్ట్రాల్లో వినిపించిన ఆక్సిజన్ కొరత, చావులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకాయి. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన పరిపాలన ఉంది, ఆక్సిజన్ పక్క రాష్ట్రాలకు ఇస్తున్నాం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత పది రోజుల నుంచి ఆక్సిజన్ ఉండటం లేదు అనే వార్తలు వింటున్నా, ప్రభుత్వ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తుంది. విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవటంతో, ఐసోలేషన్ వార్డులో ఐదుగురు రోగుల ఇప్పటి వరకు మృతి చెందారు. ఆసుపత్రి ఆవరణలో భయానక పరిస్థితితులు నెలకొన్నాయి. ఇంకా పలువురు పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.  అయితే ఇప్పటికీ ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. అక్కడ ఉన్న రోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు పరుగులు పెడుతున్నా, అక్కడ కూడా బెడ్స్ లేని పరిస్థితి. నిన్నటి నుంచి ఆక్సిజన్ రాష్ట్ర వ్యాప్తంగా లేదు అనే వార్తలు వస్తున్నా, నిన్నటి నుంచి ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని అంటున్నారు. వైద్యులు, అధికారులు సకాలంలో స్పందించలేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. మరో పక్క కలెక్టర్ రాత్రి నుంచి అక్కడే ఉండి పరిస్థితి అదుపులోకి వచ్చే దాకా సమీక్ష చేస్తున్నారు.

Advertisements