జగన్ మోహన్ రెడ్డి పై, ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర స్వరంతో విమర్శలు చేసారు. నువ్వు ముఖ్యమంత్రివా ? లేక మాల మహానాడు అధ్యక్షుడివా అంటూ, విమర్శలు గుప్పించారు. వర్గీకరణకు జగన్ అడ్డు పడుతున్నారని, మందకృష్ణ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మేనమామలు అందరూ మాలలు కాబట్టి, వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ, సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్నారని మందకృష్ణ అన్నారు. గుంటూరులో మాట్లాడుతూ, జగన్ పై ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న చంద్రబాబు పై, విమర్శలు చేసారని, కేవలం రాజకీయం కోసమే చంద్రబాబు మాల, మాదిగ మధ్య చిచ్చు పెట్టారు అని మాకు మద్దతుగా ఉన్న చంద్రబాబుని విమర్శిస్తున్నారని అన్నారు.

mrps 2007219 1

వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వారిని, బెదిరించే దొరినలో జగన్ ప్రవర్తిస్తున్నారని అనంరు. జగన్ మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే గుంటూరు నుంచి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి స్వయానా వర్గీకరణ కోరుతూ అప్పట్లో ఉత్తరాలు రాసారని, మరి ఇప్పుడు ఎందుకు యుటర్న్ తీసుకున్నారని అన్నారు ? అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, జగన్ మోహన్ రెడ్డి వర్గీకరణ చెయ్యాలి అంటూ, రాసిన లేఖను చూపించారు. దీనికి సమాధానం చెప్పాలని కోరారు. అప్పట్లో వర్గీకరణకు సరే అని, ఇప్పుడేమో, తమ కుటుంబీకులు మాలలు ఉన్నారు కాబట్టి, వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ, సామాజిక న్యాయం చెయ్యాలి కదా అని ప్రశ్నించారు.

mrps 2007219 1

అలాగే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, వర్గీకరణకు పూర్తీ అనుకూలంగా ఉన్నారని, వైఎస్ చనిపోయే ముందు ఆయన వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, ఇది వైఎస్ చివరి కోరిక అని, తండ్రి కోరిక కూడా నెరవేర్చలేని కొడుకుగా జగన్ ఉంటారా అని ప్రశ్నించారు. అప్పటి న్యాయ శాఖా మంత్రి వీరప్ప మొయిలీని కలిసిన సమయంలో, తాను జగన్ పక్కనే ఉన్నానని, కడప ఎంపీ హోదాలో, వర్గీకరణ చెయ్యాల్సిందే అని లేఖ ఇచ్చారని గుర్తు చేసారు. దీనికి సాక్ష్యం ఆ రోజు అక్కడే ఉన్న అనంతపురం ఎంపీ వెంకటరామిరెడ్డి అని అన్నారు. వైసిపీ మొదటి ప్లీనరీలో కూడా ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన తీర్మానం చేసారని గుర్తు చేసారు. కాని ఇప్పుడు జగన్ మాట తప్పారని, మడం తిప్పారని, అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే మాట మార్చారని అన్నారు. జగన్ రాసిన లేఖలు, ప్లీనరీ ప్రసంగం, వైఎస్ఆర్ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న డాక్యుమెంట్లు అన్నీ తీసుకువెళ్ళి జగన్ కు ఇస్తామని మందకృష్ణ అన్నారు.

Advertisements