బీజేపీతో కలిసి పవన్‌, జగన్‌ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని మంత్రులు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని, మోదీని మాత్రం ఒక్క మాట కూడా అనడం లేదని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, శిద్దా రాఘవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌, జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్, పవన్ లు, ముందు మోడీ అనే మాట నోటిలో నుంచి పలకాలని సవాల్ విసిరారు.

pawan 3007218 2

మంత్రి లోకేశ్‌పై చేస్తున్న ఆరోపణలను పవన్‌ నిరూపించాలని మంత్రి అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. ఇతరులపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింనందునే మోదీని తాము వ్యతిరేకించామన్నారు. చంద్రబాబును విమర్శిస్తారు గానీ, మోదీని మాత్రం ఒక్క మాట కూడా అనకపోవడం వెనక కారణమేంటని ప్రశ్నించారు. పోరాటం చేస్తున్న వారినే బలహీన పరిచే ఉద్యగం పవన్ తీసుకున్నాడు అని, ఇవి ఆంధ్రప్రదేశ్ లో కుదరవు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.

pawan 3007218 3

కేసుల మాఫీ కోసమే జగన్‌ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారని మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చేవారు తమ విధానాలు చెప్పాలని పవన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్‌ వ్యక్తిగత ఆరోపణలనే అజెండాగా మార్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు లేవని, రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ధర్మపోరాట దీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతిస్తున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.

Advertisements