మోడీ పరువు గంగలో కలిసింది. అబద్ధాలు ఆడి, ప్రజలను మభ్య పెడదాం అనుకున్న రెండో రోజే, ఆయన బండారం సొంత ప్రభుత్వంలోని మనుషులే బట్టబయలు చేసారు. ప్రధాని హోదాలో ఉంటూ అబద్ధాలు ఆడారని, సొంత మనుషులే పరోక్షంగా చెప్పారు. మూడు రోజుల క్రితం, బీజేపీ కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ పనులు అసలు జరగటం లేదని, చంద్రబాబు డబ్బులు నొక్కేస్తున్నారు అని, ఏపి ప్రభుత్వాన్ని నిలదియ్యాలని, ప్రధాని మోడీ అబద్ధాలు ఆడిన సంగతి తెలిసిందే. అయితే, మోడీ అలా అబద్ధాలు ఆడి, ఇలా దొరికిపోయారు. ఎందుకంటే, . ‘బెస్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ వాటర్‌ రిసోర్స్‌ ప్రాజెక్ట్స్‌’ విభాగంలో పోలవరం ప్రాజెక్టు ఉత్తమ ప్రణాళిక, నిర్మాణానికిగానూ ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖకు ప్రతిష్ఠాత్మక సీబీఐపీ అవార్డు దక్కింది. ఈ అవార్డును శుక్రవారమిక్కడ సీబీఐపీ దినోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమలో కేంద్రవిద్యుత్తు మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ చేతుల మీదుగా రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్‌లు అందుకొన్నారు.

award 19112017

ఒక పక్క మోడీ, పోలవరంలో ఏమి జరగటం లేదు అంటుంటే, కేంద్ర మంత్రిత్వ శాఖ మాత్రం, పోలవరం భేష్ అంటూ అవార్డ్ ఇచ్చింది. పాపం మోడీ గారి పరువు, ఇలా పోయింది. ఈ అవార్డు అందుకున్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడారు. కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారమిక్కడ సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఇరిగేషన్‌, పవర్‌ (సీబీఐపీ) అవార్డు అందుకోవడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్వహణకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది చూసైనా విపక్షాలు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.

award 19112017

పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావులతో కలిసి కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌లతో భేటీ అయి పలు అంశాలపై చర్చించామన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత అంచనాలపై త్వరలోనే సీడబ్ల్యూసీ నోట్‌ తయారుచేసి జలవనరుల శాఖకు పంపుతామని మసూద్‌ హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంనుంచి రూ.4వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని యూపీ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ‘సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపాదికన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకునిౖ సమీక్ష చేస్తున్నారు. ఇప్పటి వరకు 29 సార్లు ప్రాజెక్టును సందర్శించారు. 84 సార్లు సమీక్షించారు. 2019 డిసెంబరుకల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం." అని ఉమా అన్నారు.

Advertisements