విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గున్నారు. అలాగే సమీక్షలో కిషన్‌రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్యాస్‌ లీకేజి పై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతి ఇంటినీ తనిఖీ చేసిన పోలీసులు, సిబ్బంది, అక్కడ వారిని తరలించారు. ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులకు అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలించారు. ఇళ్లు వదిలేసి ఐదు గ్రామాల ప్రజలు బయటికొచ్చారు. ఇప్పటి వరకూ ఊపిరాడక ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సైరన్‌లు మోగించి పోలీసులు హెచ్చరించారు. వెంకటాపురంలో పెద్ద ఎత్తున పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు మాడిపోయాయి.

విశాఖ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న ఉపరాష్ట్రపతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వెంకయ్య నాయుడు. పెట్రోలియం మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, కిషన్ రెడ్డితో మాట్లాడిన వెంకయ్య నాయుడు. బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని సంబంధిత శాఖలకు వెంకయ్య నాయుడు ఆదేశం. ఇక విశాఖ ఆర్.ఆర్ వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పలువురు మృతి చెందడం, ఆస్పత్రిపాలు కావడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. "ఆర్.ఆర్ వెంకటాపురం దుర్ఘటన బాధాకరం. మనుషులే కాదు ముగజీవాలు కూడా మృతి చెందాయి. కొనఊపిరిలో ఉన్న ప్రజలను, ముగజీవాలను కాపాడాలి.

చెట్లన్నీ రంగుమారడం విషవాయువు తీవ్రతకు నిదర్శనం. యుద్ధప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు అత్యున్నత వైద్య సాయం అందించాలి. సహాయక చర్యలు వేగపరచాలి.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి" అని చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం సెహ్సారు. ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన లోకేశ్ . ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ - సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీశ్రేణులకు పిలుపునిచ్చిన లోకేశ్

Advertisements