హైదరాబాద్ లో ఉన్నటు వంటి ఎస్సీ ఎస్సీ, రైట్స్ ఫోరం, జాతీయ అధ్యక్షుడు కే.నాగరాజ అనే వ్యక్తి, జాతీయ ఎస్సీ కమిషన్ కే ఒక లేఖ రాసారు. ఏపిలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని, పేదలను ప్రలోభ పెట్టి, క్రిస్టియానిటీ కన్వర్షన్స్ చేస్తున్నారు అంటూ, పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసారు. ఆయనతో పాటు అనేక ఫిర్యాదులు, జాతీయ ఎస్సీ కమిషన్ కు అందాయి. ఈ లేఖలు అన్నిటి పైనా జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఏపి చీఫ్ సెక్రెటరీ గతంలోనే ఈ అంశం పై ఒక లేఖ రాసింది. జులై 19వ తేదీన ఒక లేఖ రాస్తూ, దీని పైన సవివరమైన నివేదిక అందచేయాలని కూడా ఆ లేఖలో తెలియ చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా దాని పైన ఎటువంటి స్పందన లేకపోవటంతో , కేంద్ర జాతీయ ఎస్సీ కమిషన్ ఈ రోజు మరో లేఖను చీఫ్ సెక్రటరీకి రాయటం జరిగింది. అందులో కొంచెం సీరియస్ గానే స్పందించింది. ఏడు రోజులు లోగా, ఏపిలో జరుగుతున్న మత మార్పిడులకు జరుగుతున్న కారణాలు ఏమిటి, ఎవరి ఎవరిని ఈ మత మార్పిడులకు జరిపిస్తున్నారు ? పేదలను ఎందుకు ప్రలోభ పెడుతున్నారు ? ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారు ? ఈ వివరాలు అన్నిటితో సమగ్ర నివేదికతో, తమకు వారం రోజులు లోగా నివేదిక అంద చేయాలని, ఎస్సీ కమిషన్ మరోసారి ఆదేశించింది.

sc 16112021 2

గతంలో జరిగిన విషయాలను ఏపి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని, మరో సారి అందుకే ఈ రిమైండర్ ని పంపుతున్నాం అని, ఈ సారి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సరైన స్పందన లేకపోతే, తగిన విధంగా, రాజ్యాంగ పరంగా, న్యాయ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో, అటువంటి చర్యలు తీసుకుంటాం అంటూ, జాతీయ ఎస్సీ కమిషన్, ఏపి చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో పేర్కొంది. ఈ విషయానికి సంబంధించి, మరి ప్రభుత్వం ఏడు రోజుల్లోగా స్పందిస్తుందా ? నివేదిక పంపిస్తుందా ? చీఫ్ సెక్రటరీ ఈ విషయం పై ఎలాంటి ఒత్తిడి లేకుండా నివేదిక పంపిస్తారా అనేది చూడాలి. జాతీయ ఎస్సీ కమిషన్ అడిగే రిపోర్ట్ లకు కూడా ప్రభుత్వం స్పందించటం లేదు అంటే ఏమని చెప్పాలి ? గతంలో కూడా ఇలాగే సీతానగరం శిరోమండనం ఘటనకు సంబంధించి, రాష్ట్రపతి ఏకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి నివేదిక అడిగినా, ఇప్పటికీ ప్రభుత్వం పంపించ లేదు. మరి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఎందుకు పట్టించుకోవటం లేదో, వారికే తెలియాలి.

Advertisements