ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం పై జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఆయన పదవీ కలాం మర్చి 31తో ముగియనుంది. ఈ లోపే కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం పై కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వానికి చిన్న పాటి యుద్ధమే జరుగుతుంది. దాదపుగా ఏడాది కాలంగా, ఇరు వర్గాల మధ్య సఖ్యత లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతుంది. ప్రతి చిన్న దానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్ట్ కు వెళ్లి, ఆయన హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. అందుకే ఆయన ఎన్నికలు అని చెప్పిన ప్రతి సారి, ప్రభుత్వం తప్పించుకుంటుంది. తాజాగా రేపు మరోసారి ఈ విషయం పై కోర్టు క్లారిటీ ఇవ్వనుంది. ఇక ఇది ఇలా ఉంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో రెండు నెలల్లో రిటైర్ అవ్వుతూ ఉండటంతో, ఆయన స్థానంలో కొత్త వారిని నియమించి, అప్పుడు ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం ప్లాన్ గా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ప్రభుత్వం చేయటం లేదు. ఇక కోర్టులు ఏమి చెప్తాయి అనే దాని పై ఈ రెండు నెలలు ఉంటాయి.

sec 17012021 2

అయితే నిమ్మగడ్డ తరువాత, ఎవరిని నియమించాలి అని అనుకున్నప్పుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లను పరిగణలోకి తీసుకోగా, మొన్నే చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన నీలం సాహనీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. జగన్ కూడా ఆమె వైపే మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె రిటైర్డ్ అయిన వెంటనే, ఆమకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తున్నారని, ఆమె ప్రమాణ స్వీకరం కూడా చేస్తారని చెప్పి కూడా, ఆ కార్యక్రమం వాయిదా పడిందని అంటున్నారు. నీలం సాహనీ ని, ఎన్నికల కమీషనర్ గా నియమిస్తారని, అందుకే ప్రభుత్వ సలహదారు పదవి ఆమె ఇంకా తీసుకోలేదని అంటున్నారు. నీలం సహానీ పని తీరు పై జగన్ మోహన్ రెడ్డికి నమ్మకం ఉందని, అందుకే ఆమెను రెండు సార్లు కేంద్రంతో మాట్లాడి పొడిగింపు కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇలా తమకు అనుకూలమైన వారిని అక్కడ పెట్టిన తరువాతే ఎన్నికలకు వెళ్ళే అవకాసం ఉంది. మరో పక్క జస్టిస్ కనకరాజ్ విషయంలో కూడా ఏదో ఒక న్యాయం చేయాలని జగన్ చూస్తున్నట్టు సమాచారం. మరి వస్తున్న వార్తలు నిజమో కాదో, తెలియాలి అంటే, మరో రెండు నెలలు ఆగాల్సిందే.

Advertisements