పోలవరం విషయంలో రోజుకి ఒక షాకింగ్ వార్త కేంద్రం నుంచి వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. ప్రతి రూపాయి కేంద్రం ఇస్తామని చెప్పింది. పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏజెన్సీగా పెట్టుకుని, పోలవరం పనులు చేస్తున్నారు. గత ప్రభుత్వం, ముందుగానే డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చింది. కేంద్రం నుంచి డబ్బులు రీయింబర్స్ అయ్యేవి. ఎన్నికల ముందు పోలవరం అంచనాలను రూ55 వేల కోట్లకు సాధించుకోవటంలో తెలుగుదేశం సక్సెస్ అయ్యింది. అయితే ఆ తరువాత మొత్తం మారిపోయింది. జగన్ ప్రభుత్వం రావటం, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపేసి రివర్స్ టెండరింగ్ కి వెళ్ళటం. వెయ్యి కోట్లు వరకు మిగిలాయి అంటూ, ప్రచారం చేయటం ఇలా జరిగిపోయాయి. దాదపుగా ఆరు ఏడు నెలలు పోలవరం పనులు ఆగిపోయాయి. తరువాత కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. అయితే పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. ఇవి ఇలా జరుగుతూ ఉండగానే, గతంలో ఆమోదించిన రూ.55 వేల కోట్లు కాకుండా, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం అంటుంది. దీని పై చర్చ జరుగుతుంది. ఈ నేపదంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఇదంతా తెలుగుదేశం పార్టీ వల్లే అంటూ ఎప్పటి లాగా రాజకీయ ఆరోపణలు మొదలు పెట్టింది. అప్పట్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తే, చంద్రబాబు చూస్తూ కూర్చున్నారు అంటూ, ఒక రకమైన ప్రచారం మొదలు పెట్టారు. అయతే ఈ ప్రచారం పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది.

nirmala 04112020 2

ఆ నాటి క్యాబినెట్ నోట్ తో పాటుగా, అనేక డాక్యుమెంట్ లు బయట పెట్టారు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, కేవలం తమ కేసులు కోసం, రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని, రాజధానిని అలాగే చేసారని, ఇప్పుడు పోలవరం విషయంలో కూడా రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నారని వాపోయారు. అయితే వీరి ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతూ ఉండగానే, ఇప్పుడు మరో అంశం మీడియా వర్గాల్లో ప్రచారం అవుతుంది. పోలవరం అంచనాలు తగ్గింపు విషయం వచ్చిన తరువాత, కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారమాన్ మీడియా సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కేంద్ర పధకాల గురించి చెప్పారు. మీడియా సమావేశం అయిన తరువాత మీడియాతో చిట్ చేస్తూ ఉండగా, పోలవరం విషయం పై ఒక విలేఖరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్లు ఆదా చేసామని చెప్తుంది కదా అని ప్రశ్నించగా, దానికి నిర్మలా సీతారమన్ మాట్లాడుతూ, అవును మంచి విషయం చెప్పారు, వెయ్యి కోట్లు ఆదా చేసారు, ఇది కూడా తుది అంచనాలలో తగ్గించాలి అంటూ, పక్కనే ఉన్న అధికారులకు, ఈ వెయ్యి కోట్ల గురించి చెప్పి, తుది అంచనాలలో తగ్గించమని కోరినట్టు తెలుస్తుంది. అంటే జగన్ గారి రివర్స్ టెండరింగ్ మరి రాష్ట్రానికి నష్టమో, కేంద్రానికి లాభమో, కాలమే నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి అన్ని విధాలుగా పోలవరం పై కొర్రీలు పెడుతూ, ఖర్చులు తగ్గిస్తూ వస్తున్నారు అనమాట.

Advertisements