ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై, గత ఏడాది వేసిన కేసు హైకోర్టుకు రావటంతో, గత వారం హైకోర్టులో ఈ విషయం పై విచారణ జరిగిన సందర్భంలో, రాష్ట్ర ప్రభుత్వం కో-వి-డ్ ఉంది కాబట్టి, ఎన్నికల నిర్వహణ కష్టం అని చెప్పగా, ఆ విషయం చెప్పాల్సింది ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కాదు అంటూ, బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలే జరుగుతుంటే, మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బంది ఏమిటి, ఎన్నికల నిర్వహణ పై అభిప్రాయం చెప్పండి అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు , అఫిడవిట్ దాఖలు చేయమని, ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ నేపధ్యంలో, హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఎన్నికల కమిషన్ ఈ కసరత్తు ప్రారంభించింది. అసలు ఎన్నికల నిర్వహణకు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏమని అనుకుంటున్నాయి అనే అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే, నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పై మీ అభిప్రాయం చెప్పండి అంటూ, ఆ ప్రెస్ నోట్ లో తెలిపింది. విజయవాడలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చే సూచనలు ప్రకారం, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై, ఒక నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. సహజంగా మెజారిటీ పార్టీల అభిప్రాయం ఎటు వైపు మొగ్గు ఉంటే, అటు వైపు నిర్ణయం తీసుకునే అభిప్రాయం ఉంది. అదే విధంగా, అధికార పార్టీ ఈ విషయంలో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఎందుకంటే గతంలో, వారు ఎన్నికలు జరపాలసిందే అంటూ వరుస ప్రెస్ మీట్లు పెట్టారు. ఇక మరో విషయం ఏమిటి అంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్, గతంలో ఇచ్చిన షడ్యుల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం పై, ఇప్పుడు ఆసక్తి నెలకొంది. గతంలో, పంచాయతీ, ఎంపీటీసి, జెడ్పీటీసి, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహణ చేయాలనీ అనుకున్నారు. దీనికి సంబంధించి, నామినేషన్ లు కూడా వేసారు. ఇక చాలా చోట్ల ఏకాగ్రీవాలు అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో, ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం పై ఆసక్తి నెలకొంది. దాదాపుగా 8 నెలలు దాటిపోయింది కాబట్టి, ఆ నోటిఫికేషన్ చెల్లుతుందా, చట్ట ప్రకారం ఏమి చేస్తారు, ఏకగ్రీవాలు ఏమవుతాయి లాంటి అంశాల పై, స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరో పక్క అధికార పక్షం ఎన్నికల నిర్వహణకు ఒప్పుకోకుండా, మిగతా ప్రతిపక్షాలు అన్నీ ఒప్పుకుంటే, పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా, తమకు నిర్వహణకు డబ్బులు ఇవటం లేదు అంటూ, ఎన్నికల సంఘం కూడా కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం నేపధ్యంలో ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements