పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాల్సిందే అని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి స్పష్టం చేసారు. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ తో పాటు, మరో ఇద్దరు అధికారులు, ఈ రోజు నిమ్మగడ్డను కలిసారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసారు. అయితే వాళ్ళు కలిసి వెళ్ళిన కొద్ది సేపటికే ఎన్నికల్ షడ్యుల్ విడుదల చేసారు. ఈ రోజు మళ్ళీ ప్రొసీడింగ్స్ విడుదల చేసారు. ఈ షడ్యుల్ ప్రకారం రేపటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. రాష్ట్రంలో నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఫిబ్రవరి 5, 9, 13, 17న పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని చెప్పారు. మొత్తంగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ప్రొసీడింగ్స్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇంతకు ముందు నిమ్మగడ్డ రమేష్ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో, ప్రభుత్వ వాదనల్లో కొత్త ఏమి లేదని అన్నారు. ఇవన్నీ గతంలోనే చెప్పారని అన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ అని అంటున్నారని, ఇంకా కేంద్రం ఎక్కడా షడ్యుల్ ఇవ్వలేదు కదా అని నిమ్మగడ్డ అన్నారు. అయితే దీని పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్తుందా, లేదా ఎన్నికలకు రెడీ అంటుందా అనేది చూడాలి.

Advertisements