ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న జాయింట్ డైరెక్టర్ ను ఎన్నికల కమిషన్ తొలగించిన సంగతి తెలిసిందే.  ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ఉన్న వాణీమోహన్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగించారు. వాణీమోహన్ సేవలు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ లో అవసరం లేదని, అందుకే ఆమెను తొలగిస్తున్నామని నిమ్మగడ్డ తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ కు వివరాలు తెలుపుతూ లేఖ రాసారు. వాణీమోహన్‍ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆమెను రిలీవ్ చేస్తూ ప్రభుత్వానికి కూడా తెలిపారు. నిన్న జాయింట్ డైరెక్టర్ ముందస్తు సమాచారం లేకుండా సెలవు పై వెళ్ళటం, మిగతా ఉద్యోగులను కూడా సెలవు పెట్టాలని ఒత్తిడి చేయటంతో, అయన్ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ రోజు ఏకంగా ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిని కూడా తప్పించటం సంచలనంగా మారింది. అయితే ఆమెను కేవలం సేవలు అవసరం లేదనే రిలీవ్ చేసారని చెప్తున్నా, దీని వెనుక ఇంకా ఏదో ఉండే ఉంటుందని అంటున్నారు. మరికొద్ది సేపట్లోనే, హైకోర్టు డివిజిన్ బెంచ్ లో, నిన్న సింగల్ బెంచ్ ఎన్నికల్ షెడ్యుల్ సస్పెండ్ చేస్తూ ఇచ్చిన తీర్పు పై, వాదనలు విననున్నారు.

Advertisements