హైకోర్ట్ నిమ్మగడ్డ రమేష్ ని, పదవిలో చేరాలని తీర్పు ఇచ్చిన తరువాత కూడా, రమేష్ కు ఆ హక్కు లేదు అంటూ, నిన్న ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జెనెరల్ ప్రెస్ మీట్ పెట్టటం పై, నిమ్మగడ్డ రమేష్ స్పందించారు. ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, ప్రభుత్వ ప్రచారాన్ని ఖండించారు. హైకోర్ట్ తీర్పును, ఆదేశాలను, రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అంటూ, రమేష్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం, నిన్న అడ్వకేట్ జనరల్ ద్వారా ప్రకటించిన అంశాలు చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందో అర్ధం అవుతుందని రమేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, అలాగే కనకరాజ్ ని అపాయింట్ చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోని, కోర్ట్ కొట్టేసిన విషయాన్ని గుర్తు చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క స్వయం ప్రతిపత్తి, సమగ్రతను దెబ్బ తీసేలా, ప్రభుత్వం చర్యలు ఉన్నాయని, రమేష్ కుమార్ పేర్కొన్నారు.

హైకోర్ట్ తీర్పు ప్రకారమే తాను, ఎలక్షన్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. కోర్ట్ ఆదేశాలు ప్రకారం, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా, కనకారాజు నియామకం చెల్లదని, ఆయన ఎన్నికల కమీషనర్ గా ఇంకా కొనసాగలేరని అన్నారు. రాజ్యాంగ బద్ధ పదవి ఖాళీగా ఉండకూడదు అని అన్నారు. కోర్టు ఆదేశాలు ప్రకారమే, తాను మళ్ళీ పదవి చేపట్టానని అన్నారు. నిన్న ప్రభుత్వం పెట్టించిన ప్రెస్ మీట్ లో, వాడిన పదాలు వింటుంటే, కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా చెయ్యాలని చూస్తున్నట్టు అర్ధం అవుతుంది అని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ తీసుకుంటే, కోర్ట్ తీర్పుని ధిక్కరించటమే అని రమేష్ కుమార్ తన ప్రెస్ నోట్ లో తెలిపారు.

Advertisements