ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూలు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఒక పక్క ప్రభుత్వం తాము ఎన్నికలు ఒప్పుకోం అంటూ, పడుతున్న పాట్లు చూస్తున్నాం. సచివాలయ ఉద్యోగ సంఘం నుంచి వెంకట రామిరెడ్డి, ఏపి ఎన్జీవోల సంఘం నుంచి చంద్రశేఖర్ రెడ్డి, పోలీసులు సంఘం, ఇలా అందరూ నిన్న వరుస పెట్టి ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్ లు విడుదల చేసి, మేము ఎన్నికల్లో పాల్గునేది లేదు, మేము సహకరించేది లేదు అంటూ, హడావిడి హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రభుత్వం కూడా అత్యవసర పిటీషన్ అంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, ఇటు నిమ్మగడ్డ మాత్రం, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో, ఆయనకు రాజ్యాంగబద్ధ పదవిలో, ఎన్నికల సమయంలో సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి, తన అధికారాలని ఆయన ఉపయోగిస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రభుత్వం ఆయన్ను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే, ఇప్పుడు ఆయన రూల్స్ ప్రకారం, ఒక్కో బాణం వదులుతున్నారు. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ కు లేఖ రాసారు. గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు చేసే సందర్భంలో, అనేక ఘటనలు జరిగాయి. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేసి, అఅనేక ఏకాగ్రీవాలు చేసుకున్నారు.

nimmagadda 10012021 2

ఈ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగాయి. చివరకు బొండా ఉమా, బుద్దా వెంకన్న మీదకు కూడా వచ్చిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో అప్పట్లో నిమ్మగడ్డ కొంత మంది అధికారుల పై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో, వారిని ఇప్పుడు మళ్ళీ తప్పించాలని నిమ్మగడ్డ, తాజాగా లేఖ రాసారు. అప్పట్లో ఆయన ఆదేశాలు అమలు కాలేదు. ఎన్నికలు వాయిదా పడటంతో, ఈ ఆదేశాలు అమలు కాలేదు. చిత్తూరు కలెక్టర్, గుంటూరు కలెక్టర్, తిరుపతి, గుంటూరు లో ఎస్పీలను బదిలీ చేయాలనీ, మాచర్ల సిఐని సస్పెండ్ చేయాలని, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను ట్రాన్స్ఫర్ చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను, ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు వచ్చిన నేపధ్యంలో, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపధ్యంలో, ఆ ఆదేశాలు అమలు చేయాలని నిమ్మగడ్డ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. గతంలో మేము చెప్పిన వారందరినీ బదిలీ చేసి, వారి స్థానంలో వేరే వారిని నియమించాలని నిమ్మగడ్డ కోరారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, సహకరించకపోతే నిమ్మగడ్డ ఏమి చేస్తారో చూడాలి.

Advertisements