మన రాష్ట్రాన్ని దేశం గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది. కాని, మహా మేధావులు అయిన జగన్, పవన్ మాత్రం, మన రాష్ట్రంలోని యువతలో విష భీజాలు నాటుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మా కడపను నిర్లక్ష్యం చేస్తున్నాడు, మొత్తం అమరావతికే చేస్తున్నాడు అంటాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావలి, అన్నీ అమరావతికి దోచిపెడుతున్నారు అంటాడు. ఈ మూర్ఖుల మాటలు ఎలా ఉన్నా, దేశం మాత్రం, కడపకు ఏమి చేసారు, ఉత్తరాంధ్రకు ఏమి చేసారో గుర్తిస్తుంది. దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నీతిఆయోగ్‌ ప్రారంభించిన ‘ఆకాంక్షిత జిల్లాల’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఒకరిని చూసి ఒకరు అభివృద్ధి చెందేందుకు వీలుగా పెట్టిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు మంచి ముందడుగు వేశాయి.

niti 30062018 2

ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండునెలల్లో జిల్లాలు స్వయంగా సమర్పించిన సమాచారం ఆధారంగా వాటి పురోగతిని లెక్కించి నీతిఆయోగ్‌ శుక్రవారం కొత్తగా 108 జిల్లాలకు డెల్టార్యాంకులు విడుదల చేసింది. ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం-జలవనరులు, ఆర్థిక సమ్మిళితం-నైపుణ్యాభివృద్ధి-మౌలికవసతులు అనే ఐదు రంగాల్లో అభివృద్ధి ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ పేర్కొన్నారు. ఈ రెండునెలల్లో సాధించిన రాష్ట్రాల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. గత రెండునెలల్లో బాగా పురోగతి సాధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం 4, కడప 5, విశాఖపట్నం 14 ర్యాంకులో నిలిచాయి.

niti 30062018 3

విజయనగరం, కడప, విశాఖపట్నం జిల్లాలు ‘విద్యాపరంగా’ మంచి పనితీరు కనబరిచి 1, 4, 5 ర్యాంకులు సాధించాయి. ‘ఆర్థిక సమ్మిళిత పురోగతి’లో విశాఖపట్నం జిల్లా రెండో ర్యాంకు సాధించింది. అన్ని విభాగాలూ కలిపి చూస్తే 17.5% మార్కులతో విజయనగరం నాలుగు; 14.9% మార్కులతో కడప ఐదు; 11% మార్కులతో విశాఖపట్నం 14వ ర్యాంకు సాధించాయి. బేస్‌లైన్‌ ర్యాంకింగ్‌లో ఒకటోస్థానంలో నిలిచిన విజయనగరంజిల్లా గత రెండునెలల్లో సాధించిన పురోగతిలో నాలుగోస్థానాన్ని ఆక్రమించింది. ఇదివరకు నాలుగులో ఉన్న కడప ఇప్పుడు ఐదులో; 13లో ఉన్న విశాఖపట్నం 14వస్థానంలో నిలిచాయి.

Advertisements