ఒక పక్క క-రో-నా తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, టీకాలు స్టాక్ లేక, మందులు దొరక్క, ఇలా అనేక ఇబ్బందులు ఉంటే, అవి పట్టించుకోవలసిన ప్రభుత్వాలు, ఈ సమయంలో కూడా రాజకీయం, కక్ష సాధింపు మీదే ఉన్నాయి. వీకెండ్ వచ్చింది అంటే, జేసిబీలతో దిగుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ వీకెండ్ కూడా మళ్ళీ కూల్చివేతలు మొదలు పెట్టింది. పాత గాజువాకలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విశాఖ ఉక్కు కోసం ముందుండి పోరాటం చేస్తూ, నిరాహార దీక్ష కూడా చేసిన పల్లా శ్రీనివాస్‍కు చెందిన భవనాలను ఉదయమే వచ్చిన జీవీఎంసి అధికారులు కూల్చేస్తున్నారు. ఆ భవనాలు నిర్మాణంలు ఉన్నాయి. ఈ భవనాలు అన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే కూల్చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ఇందు కోసం భారీగా పోలీసులను కూడా రంగంలోకి దించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని,అసలు ఏ తప్పు జరిగిందో చెప్పలేదని, ఏమి లేకుండా ఉన్న పళంగా వచ్చి, కుల్చేస్తున్నారని, పల్లా శ్రీనివాస్ ఆరోపించారు. నోటీసులు ఇవ్వకుండా, అసలు ఎలా కూల్చేస్తారని నిలదీశారు. పల్లా శ్రీనివాస్ కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే అధికారాలు మాత్రం నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు.

gajuwaka 25042021 2

పల్లా శ్రీనివాస్ మాత్రం, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, నోటీసులు ఇస్తే అమ్మవారి గుడిలో ప్రమాణం చేయాలని అధికారులను నిలదీశారు. అయినా అధికారులు మాత్రం, తమ పని తాము చేసుకు పోతున్నారు. ఈ ఘటన పై టిడిపి నేతలు భగ్గుమన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రజలు ఒక పక్కన ఇబ్బందులు పడుతుంటే, అవేమీ పట్టించుకోకుండా, టిడిపి నేతల పై కక్ష సాధింపుకి దిగారని వాపోయారు. జగన్ మోహన్ రెడ్డి, పని దినాల్లో అక్రమాలు, సెలవు దినాల్లో విధ్వంసాలు చేస్తుందని వాపోయారు. ఇంట్లో మనుషులు లేని సమయంలో దొంగలు పడినట్టు, కోర్టు సెలవు దినాల్లో ఇలా చేయటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పల్లా శ్రీనివాస్ పై కక్ష సాధింపు చేస్తున్నారని వాపోయారు. రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా లేక రాక్షసులు పాలిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది అని అన్నారు. అధికారం శాశ్వతం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

Advertisements